మెగా స్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఆచార్య. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. కోకాపేటలో దాదాపు 20 కోట్ల తో ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ కూడా పాల్గొన్న కీలక సన్నివేశాల తో పాటు మెగాస్టార్ మీద సోలో సాంగ్ ని షూట్ చేశారట. అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సోనూసూద్ మీద సీన్స్ కంప్లీట్ అయ్యాయి. కాగా ఇక మిగిలింది ముఖ్యంగా కాజల్ పాల్గొనాల్సిన సీన్స్ అండ్ మెగాస్టార్ .. కాజల్ మీద చేయాల్సిన సాంగ్స్. అలాగే చరణ్ పార్ట్ బ్యాలెన్స్ ఉంది.
అయితే తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ ఆచార్య సెట్ లో అడుగుపెట్టింది. భర్త గౌతం కిచ్లు కూడా ఆచార్య షూటింగ్ స్పాట్ కి విచ్చేసి చిత్రబృందాన్ని సర్ ప్రైజ్ చేశారు. కాజల్ – కిచ్లు జంటకు ఈ సందర్భంగా ఆచార్య చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్త జంటకు దండలు మార్చి మరోసారి ఆన్ లొకేషన్ లో సందడి చేసారు. మెగాస్టార్ చిరంజీవి కొత్త జంటను బొకేస్ ఇచ్చి ఆశీర్వదించారు. ఈ సెలబ్రేషన్ లో మెగాస్టార్, దర్శకుడు కొరటాల శివ తో పాటు చిత్ర యూనిట్ కూడా ఉన్నారు.
ఇక ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ .. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాం చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాలో చరణ్ పాత్ర ని కొరటాల అద్భుతంగా మలిచినట్టు సమాచారం. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు చరణ్. కాగా ఆచార్య కోసం జనవరి నుంచి చరణ్ బల్క్ డేట్స్ ఇచ్చాడని సమాచారం. మణిశర్మ సంగీతమందిస్తున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో మెగా స్టార్ మెగా పవర్ స్టార్ లని స్క్రీన్ మీద చూస్తుంటే రెండు కళ్ళు చాలంటున్నారు చిత్ర యూనిట్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!