Karthika Deepam: బిచ్చగాడు కార్తీక్ ను చూస్తాడా..? అసలు దీప ఏమైంది.. ప్రాణాలతోనే ఉందా.. లేక..?

Share

Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ వస్తుంది..ఒకపక్క కోటేష్, శ్రీవల్లి చనిపోయారు.. బాబు బాధ్యతను కార్తీక్, దీపలు తీసుకున్నారు. మరో పక్క రుద్రాణి అప్పు తీర్చడం ఎలా అని ఆలోచనలో పడ్డ కార్తీక్, వీరిని వెతికే పనిలో పడ్డ బిచ్చగాడు… ఇలా అనేక ట్విస్ట్ లతో మరెన్నో మలుపులతో కార్తీక దీపం సీరియల్ ఆసక్తిగా మారింది. మరి ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్ లో ఏమి జరగనుందో తెలుసుకుందామా..దీప పిండివంటలు చేస్తూ బాకీ తీరుస్తుందా ఎలా తీర్చిద్దో నేను చూస్తాను..నేను నీతో వంటలు చేయించడం ఆపడం కాదు నీ మొగుడి చేతే ఆపేలా చేయిస్తా అనుకుంటూ కార్తీక్ దగ్గరకు వెళుతుంది రుద్రాణి.


Intinti Gruhalakshmi: అమ్మో తులసి మామూలుది కాదు ,లాస్య కి అదిరిపోయే ట్విస్ట్లు .. అయోమయంలో నందు..!!
Karthika Deepam: కార్తీక్ ను అవమానించిన రుద్రాణి

కార్తీక్ ఈలోపు బాబుకు పాలు కలుపుతూ ఉంటాడు.ఈలోపు మీ ఆవిడ బయటకు వెళ్లి వ్యాపారం చేస్తుంటే నువ్వు ఇంట్లోనే ఉండి బాబుని చూసుకుంటున్నావా అని వెటకారంగా మాట్లాడుతుంది. మొగుడు పెళ్లాం అయింది..పెళ్లాం మొగుడైంది అన్న రుద్రాణి మాటలతో కార్తీక్ సీరియస్ అయ్యి ఇక ఆపు అని గట్టిగా అరుస్తాడు.పనీ పాటా చేతకాని వాళ్లకి కోపానికి ఏమి తక్కువలేదులే అంటుంది. సర్లే గాని మా రంగరాజు ఎలా ఉన్నాడంటూ బాబుని అడుగుతుంది. మీకు ఇద్దరు పిల్లలున్నారు కదా బాబుని నాకు ఇచ్చేయండి అని అడుగుతుంది. కార్తీక్ ఏమి మాట్లాడడు.నువ్వు ఇంట్లో బాబుని బాగానే ఆడిస్తున్నావ్ లే గాని ..బయటకు వెళ్లిన నీ పెళ్లాం దీప, పిల్లలు క్షేమంగా ఇంటికి వస్తారో లేదో చూసుకో.. అసలే రోజులు బాగాలేవు, ఎవరి టైమ్ ఎలా ఉంటుందో అని ముందు జాగ్రత్తగా చెప్పానంటూ బెదిరించి అక్కడ నుండి వెళ్లిపోతుంది.

Marriage:  వివాహం  త్వరగా  జరగాలన్నా ,ఐశ్వ‌ర్య ప్రాప్తి కావాలన్నా  ఇది సులభమైన మార్గం!!
నామొగుడు ముంబై లో ఉన్నాడన్నా మోనిత :

మరోపక్క సౌందర్య ఇంట్లోంచి విసిరిపడేసిన ఫొటోని ప్రజావైద్యశాలలో పెట్టిన మోనిత ఆ ఫోటోను చూసి కార్తీక్ ఎంత బావున్నావ్ అనుకుంటూ ఉయ్యాల్లో ఉన్న బాబు బొమ్మతో మాట్లాడుతుంది. ఇంతలో అక్కడకు వచ్చిన నరసమ్మ మేడం సార్ ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. ముంబై వెళ్లాడని చెప్పిన మోనితతో మీ ప్రేమకథ మొత్తం నాకు తెలుసు అంటుంది. అయితే ఇంకేం ఇబ్బంది లేదులే అంటుంది.

కార్తీక్ ను వెతికే పనిలో బిచ్చగాడు :

సీన్ కట్ చేస్తే కార్తీక్ ను వెతుకుంటూ బిచ్చగాడు తాడికొండ గ్రామానికి వెళతాడు. వెళ్లడం వెళ్లడంతోనే రుద్రాణి మనిషి దగ్గరకు వెళ్లి కార్తీక్ ఫొటో చూపించి ఈయన మీకు తెలుసా అని అడుగుతాడు. కానీ అతను ఆ ఫొటో చూడకుండానే వెళ్లిపోతాడు. రుద్రాణి మాటలు తలుచుకుని కార్తీక్ దీప-పిల్లలు క్షేమంగా ఇంటికి రావాలి అనుకుంటూ ఉంటాడు. అయిన దీప ఇంకా ఇంటికి రాలేదంటని ఆలోచిస్తాడు. ఇంతలో అక్కడకు వచ్చిన మహాలక్ష్మి అనే మహిళకు బాబుని చూడమని చెప్పి అని స్కూల్ కివెళతాడు. స్కూల్లో కూర్చున్న పిల్లలు అమ్మ ఇంకా రాలేదు ఏంటి ఆకలి వేస్తోంది అనుకుంటారు.

క్యారేజ్ తీసుకుని స్కూల్ కి వెళ్లిన రుద్రాణి ఏమిచేయనుంది?

ఇంతలో అక్కడకు క్యారియర్ తీసుకుని రుద్రాణి ఎంట్రీ ఇస్తుంది.అప్పుడు పండ్లు, చాక్లెట్లు ఇచ్చి వెళ్లాను కదా ఇప్పుడు తినిపించి వెళతా అంటుంది రుద్రాణి. మీరెవరు మాకు లంచ్ తేవడానికి, మేం ఎందుకు తినాలి?మా అమ్మ తీసుకొస్తుంది వెళ్లండి అంటుంది.ఆకలి వేస్తుందని ప్రేమగా అన్నం తినిపిస్తుంటే వద్దంటారేంటి అంటూ తినిపించేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడకు వెళతాడు కార్తీక్. అన్నం తినమని బెదిరిస్తోందని చెబుతారు పిల్లలు. దీంతో కార్తీక్ కోపంతో బుద్ధిలేదా అని రుద్రాణిపై మండిపడతాడు. అయినా కార్తీక్ పిల్లలంటే నాకు ఇష్టం వాళ్లని ఏమీ చేయను అంటూనే ఇంతకు దీప ఇంటికి వచ్చిందా?. వెళ్ళు ఎక్కడుందో వెతుక్కోవా అంటుంది.అక్కడితో ఆ సీన్ అయిపోతుంది.

బిచ్చగాడు కార్తీక్ ను చూస్తాడా..??

మరోపక్క తాడికొండ చేరిన బిచ్చగాడు కార్తీక్..దీపను వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో కార్తీక్ కూడా దీప గురించి వెతుకుతూ, ఎవర్ని అడగాలి? దీపకి ఏం కాకూడదని మనసులో కోరుకుంటాడు. ఇంతలో కార్తీక్ బిచ్చగాడికి ఎదురుగా వస్తాడు కానీ అప్పుడే వేరే వ్యక్తి టోపీ కిందపడడంతో బిచ్చగాడు కిందకు వంగుతాడు. అంతలో కార్తీక్ బిచ్చగాడిని క్రాస్ అయి వెళ్లిపోతాడు. అంతే అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.అసలు ఇంతకీ దీప ఏమైంది… ప్రాణాలతోనే ఉందా?లేక రుద్రాణి ఎమన్నా చేసిందా అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.!


Share

Related posts

మరో రెండు వారాల్లో మెట్రో పరుగులు..!!

sekhar

పవన్ – హరీష్ సినిమాపై సంచలన ట్వీట్ పెట్టిన దేవి శ్రీ ప్రసాద్..!!

sekhar

IND vs ENG: ఇంగ్లండ్ సిరీస్ ముందే చిక్కుల్లో భారత్..! హెల్ప్ చేస్తానన్న దినేశ్ కార్తీక్

arun kanna