KGF 2 : ఎవరు ఊహించని విధంగా కేజిఎఫ్ సినిమా మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో రాబోతున్న “కేజిఎఫ్- 2” అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
కేజిఎఫ్ మొదటి భాగం సినిమా రిలీజ్ అయిన క్రమంలో అసలు యాష్ అనే హీరో ఎవరో కూడా తెలియని పరిస్థితి. కానీ ఆ సినిమా విజయంతో యాష్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగటమే మాత్రమే కాక, యాష్ కి మంచి మార్కెట్ క్రియేట్ అయింది. కేజిఎఫ్ మొదటి భాగం తెలుగు రైట్స్ ఐదు కోట్లకు అమ్ముడైయితే 12 కోట్లు వసూలు చేసింది. ఇదిలా ఉంటే కేజిఎఫ్- 2 సినిమాకి సంబంధించి తెలుగు రైట్స్ 60 కోట్లు పలుకుతుంది. కేజిఎఫ్- 2 క్రేజ్ చూస్తే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసే దిశగా రైట్స్ పలకడమే కాక వ్యూస్ విషయంలో కూడా దూసుకుపోతుంది. సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్ రెండు రోజులు గడవకముందే “ఆర్ఆర్ఆర్” రికార్డులను పక్కకు తనేసింది. దీంతోఈ హైప్ ని బేస్ చేసుకుని సినిమా యూనిట్ 60 కోట్లకు పైగా రైట్స్ అమ్మాలని సరికొత్త టార్గెట్ పెట్టుకుందట. దీంతో హిట్టయితే వంద కోట్లకు పైగా రావడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో తేడాగా టాక్ బయటకు వచ్చింది అంటే.. మొత్తానికి రాడ్ పడిపోతుందని డిస్ట్రిబ్యూటర్లు భయాందోళనలో ఉన్నారట. పైగా లాక్డౌన్ తర్వాత భారీ స్థాయిలో KGF 2 రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు సినిమా రైట్స్ కొనటానికి కొంత ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా రైట్స్ ఈ విషయంలో తెలుగులో KGF 2 సినిమా స్టామినాని పెంచింది అనే టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!