Kollywood Directors: టాలీవుడ్‌పై తమిళ దర్శకుల దండయాత్ర..మనవాళ్లకేమైంది..?

Share

Kollywood Directors: ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పరభాషా దర్శకులు జండా పాతేందుకు బాగా ట్రై చేస్తున్నారు. మన దగ్గర దర్శక ధీరుడు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ లాంటి వారు మంచి ఫాంలో ఉన్నారు. వీరి సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. వీరితో సినిమాలు చేసేందుకు మన స్టార్ హీరోలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజమౌళి లాంటి దర్శకులు కనీసం ఏడాదికి ఓ సినిమా చేసినా చాలు దాదాపు పెద్ద హీరోలందరూ ఆయనతో సినిమా చేయడానికి అవకాశం ఉంటుంది.

kollywood directors vs tollywood directors
kollywood directors vs tollywood directors

కానీ ఆయన ఓ సినిమా మొదలుపెడితే ఎప్పుడు పూర్తవుతుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. బాహుబలి సినిమా రెండు భాగాల కోసం దాదాపు 5 ఏళ్ళు సమయం తీసుకున్నాడు. కొరటాల శివ, అనిల్ రావిపూడి లాంటివారు వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ ఎంతకాదన్నా ఒక్కొక్కరు ఏడాదికి ఒక సినిమాను మించి చేయడం లేదు. మన పాన్ ఇండియన్ స్టార్ హీరోలు ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ఎన్.టి.ఆర్, రాం చరణ్, అల్లు అర్జున్ లాంటి వారికి వరుసగా సినిమాలు చేయాలని ఉన్నా ఇలా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ తమ సినిమాలతో ఏళ్ళ తరబడి బిజీగా ఉండటంతో ఇతర భాషలల్లో భారీ హిట్స్ అందుకుంటున్న దర్శకులతో మనవాళ్లు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

Kollywood Directors: ఆ సినిమా మేకింగ్ విధానం మన హీరోలకి విపరీతంగా నచ్చింది.

కేజీఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ సినిమా మేకింగ్ విధానం మన హీరోలకి విపరీతంగా నచ్చింది. దాంతో ప్రబాస్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు లాంటి వారు ఆయనతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ సలార్ సినిమాను చేస్తున్నాడు. ఆ తర్వాత ఎన్.టి.ఆర్ – మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ కూడా మొదలవబోతోంది. వీటి తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ప్రశాంత్ నీల్ – అల్లు అర్జున్ సినిమా ఉండబోతోంది. అంతేకాదు ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్‌లో దిల్ రాజు ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

అలాగే శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఓ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్. కోలీవుడ్‌లో ఈ మధ్య ఫాంలో లేని దర్శకుడు ఎన్. లింగు స్వామీ. ఆయన దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ – కృతి శెట్టి జంటగా ఓ ద్వి భాషా చిత్రం తెరకెక్కుతోంది. ఏ ఆర్ మురగదాస్ కూడా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. ఆల్రెడీ మహేశ్ బాబుతో స్పైడర్ సినిమాను తీశాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో మరోసారి మహేశ్‌తో సినిమా తీసి భారీ హిట్ ఇవ్వాలనుకుంటున్నాడు.

Kollywood Directors: ఇది మన ఇండస్ట్రీకి మైనస్ అని ఇక్కడ దర్శకులకి ప్రాధాన్యత తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.

అయితే త్వరలో మురగదాస్ ..అల్లు అర్జున్‌తో ఓ మూవీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇదొక సైన్స్ ఫిక్షన్ అని తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా సుజీత్, వి.వి.వినాయక్‌లను కాదని తమిళ దర్శకుడు మోహన్ రాజాకి అవకాశం ఇచ్చారు. ఈ సినిమా గాడ్ ఫాదర్ అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. ప్రభాస్ తన బాలీవుడ్ స్ట్రైట్ మూవీ ఆదిపురుష్ కూడా హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా మన టాలీవుడ్ హీరోలందరూ పరభాషా దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఇది మన ఇండస్ట్రీకి మైనస్ అని ఇక్కడ దర్శకులకి ప్రాధాన్యత తగ్గుతుందని ఒక వర్గం ఇండస్ట్రీ వారు అభిప్రాయపడుతున్నారు.


Share

Related posts

Rakshasudu 2 : ‘రాక్షసుడు 2’ కోలీవుడ్ హీరో..?

GRK

హైకోర్టు సాక్షిగా ఒకే రోజు రెండు సార్లు పరువు పొగొట్టుకున్న జగన్ సర్కార్

somaraju sharma

‘పట్నఘఢ్’ విడుదలపై స్టే ఇవ్వలేం: సుప్రీం కోర్ట్

Siva Prasad