NewsOrbit
న్యూస్ సినిమా

Kovai Sarala: కమెడియన్ కోవై సరళ గురించి కమలహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Kovai Sarala: ప్రముఖ హాస్యనటి కోవై సరళ ‘సెంభీ’ అని చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. ఆర్ రవింద్రన్, ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ అజ్మాల్ ఖాన్, రియా కలిసి నిర్మించిన చిత్రం ఇది. మైనా మూవీ ఫేమ్ ప్రభు సల్మాన్ ఈ చిత్రానికి కథ, దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడమే కాకుండా ఈ సినిమాలో కూడా నటించాడు. త్వరలోనే రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ను చెన్నైలోని సత్యం థియేటర్‌లో శుక్రవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ నటుడు కమల్‌ హాసన్ గెస్ట్‌గా వచ్చి ఆడియో సాంగ్స్ ఆవిష్కరించారు.

Kovai Sarala: కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Kovai Sarala

ఈ సందర్బంగా ‘సెంభీ’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన కోవై సరళ మాట్లాడుతూ ఈ సినిమాకి దర్శకుడే కథనాయకుడని చెప్పింది. ఆయన దర్శకతంలో నటించడం చాలా సులభం అన్నారు. కేవలం ప్రభు సల్మాన్ చెప్పినట్లు యాక్ట్‌ చేస్తే చాలు సినిమా సూపర్‌గా వస్తుందని ఆమె తెలిపింది. తరువాత కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘కోవై సరళను కొంతమంది అక్క అంటారు, మరికొంత మంది అమ్మ అంటారు, కానీ నేను ఏ వరుసతో పిలవాలో అర్థం కావడం లేదు. అందుకే పాప అని పిలుస్తాను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సరళతో తనకు మంచి పరిచయం ఉందని చెప్పుకొచ్చాడు. సెంభీ సినిమాలో సరళ చాలా బాగా నటించిందని.. బాలనటిగా కూడా అద్భుతంగా చేసిందని కొనియాడారు.

చిన్నా, పెద్దా కాదు సినిమా బాగుందా లేదా అన్నదే ముఖ్యం

Kovai Sarala

“ఎంత ఖర్చు పెట్టి సినిమా తీసినా కూడా కథ నచ్చకపోది ప్రేక్షకులు ఆదరించరు. అలాగని చిన్న సినిమాలను నిర్లక్ష్యం చేయకూడదు. సినిమా చిన్నదైనా కథ బాగుంటే దానిని ఆదరించాలి. హైబడ్జెట్, లో బడ్జెట్ సినిమాలని రెండింటిగా చూడకూడదు ఏది బాగుంటే.. అది మంచిగా ఉందని ఒప్పుకోవాలి” అని ఈ భారతీయుడు హీరో చెప్పుకొచ్చాడు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu