న్యూస్

KTR: పార్టీలకు కొత్త అర్ధాలు చెబుతున్న నేతలు..బీజేపీకి కొత్త అర్దం చెప్పిన కేటిఆర్

Share

KTR: ఇటీవల కాలంలో వివిధ రాజకీయ పార్టీలకు ప్రత్యర్ధులు కొత్త అర్ధాలు చెప్పడం పరిపాటిగా మారింది. ఏపిలో వైసీపీని ఏమి చేతగాని పార్టీ అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్శింహరావు అర్ధం చెప్పారు. ఇక టీడీపీ గురించి తెలుగు తాలిబన్ పార్టీ అని వైసీపీ పెడన ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి జోగి రమేష్ గతంలో విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని తుగ్లక్ రేపిస్ట్ పార్టీగా మారిపోయిందని బీజేవైఎం నేత ఒకరు విమర్శించారు. తాజాగా బీజేపీ పార్టీకి కొత్త అర్ధం చెప్పారు తెలంగాణ మంత్రి కేటిఆర్. బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ అంటూ కొత్త భాష్యం చెప్పారు కేటిఆర్.

KTR Slams Bjp
KTR Slams Bjp

KTR: కేసీఆర్ సర్కార్ పై అమిత్ షా విమర్శలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా నిన్న రాత్రి తుక్కగూడలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొని కేసిఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కేసిఆర్ సర్కార్ దించడానికి తాను అవసరం లేదని బండి సంజయ్ చాలని అన్నారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసిఆర్ నెరవేర్చలేదని అమిత్ షా అన్నారు. కేసిఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అమిత్ షా .. కేసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి యువత కదిలిరావాలని పిలుపునిచ్చారు.

బీజేపీ అంటే బిక్వాస్ జుమ్లా పార్టీ

కాగా అమిత్ షా పర్యటనపై మంత్రి కేటిఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో పొలిటికల్ టూరిజం కొనసాగుతోందనీ, మరో టూరిస్ట్ వచ్చి తిని వెళ్లారని అమిత్ షాను ఉద్దేశించి సెటైర్ వేశారు కేటిఆర్. గత ఎనిమిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని విమర్శించిన కేటిఆర్ ..బీజేపీ అంటే బిక్వాస్ జుమ్లా పార్టీ అని కొత్త అర్ధాన్ని చెప్పారు.


Share

Related posts

BIRYANI: మూలుగు బొక్క బిర్యానీ గురించి మీకు తెలుసా …?

Ram

ఆ విధంగా వ్యవహరించి ఉంటే నా రాజకీయ ప్రయాణం వేరేలా ఉండేది అంటున్న విజయశాంతి..!!

sekhar

Bigg Boss Telugu 5: ఫుల్ హ్యాపీగా ఉన్న షణ్ముఖ్ జస్వంత్ ఫ్యాన్స్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar