న్యూస్

Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం..దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర

Share

Congress: 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మేరకు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. రాజస్థాన్ లోని ఉదయపుర్ లో నిర్వహిస్తున్న చింతన్ శిబిర్ లో ఈ విషయంపై చర్చించినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా పాదయాత్రలు, జనతా దర్భార్ (ప్రజా సమావేశాలు) నిర్వహించడం ద్వారా ప్రజల మనసును చేరుకోవాలని పార్టీ యోచిస్తోంది.

Congress leader rahul plans padayatra

Congress: దిగ్విజయ్ సింగ్ ఓ విశ్లేషాత్మక ప్రెజెంటేషన్

ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీ తో పాటు ముఖ్యనేతలు అందరూ పాల్గొంటారని సమాచారం. ప్రధానంగా యువతను ఆకర్షించేందుకు నిరుద్యోగ అంశాన్ని ప్రస్తావించనుంది. ఈ జన జాగరణ్ అభియాన్ కార్యక్రమంపై పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఓ విశ్లేషాత్మక ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా ప్రజలకు కాంగ్రెస్ చేసేందుకు యూత్ కాంగ్రెస్ కూడా ఇటువంటి ప్రతిపాదనే చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదన దాదాపు ఖరారు అయినట్లు వార్తలు వినబడుతున్నాయి. ఏడాది చివరలో రాహుల్ పాదయాత్ర ఉంటుందని చెబుతున్నారు. ఇదే క్రమంలో అన్ని రాష్ట్రాల్లో నేతలు కూడా పాదయాత్రలు చేపట్టి పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రస్తుత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడం వంటివి చేస్తారని తెలిపారు.

Congress: కీలక నిర్ణయాలను ప్రకటించనున్న సోనియా గాంధీ

రాజకీయ ఎత్తుగడలు, రంగాల వారీగా నూతన విధానాలు, సంస్థాగత మార్పులు, ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్. దేశ రాజకీయ, ఆర్ధిక, సామాజిక, రైతాంగ, యువజన, పార్టీ సంస్థాగత అంశాలపై సమావేశాల ముగింపు ఉపన్యాసంలో సోనియా గాంధీ కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు.


Share

Related posts

సమంత షో లో ఎమోషనల్ అయిన నాగచైతన్య..!!

sekhar

బ్రేకింగ్ : రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘ అల్లు ‘ – మెగా ఫామిలీ టార్గెట్

Vihari

Harvard Experts: హార్వర్డ్ శాస్త్రవేత్తలు చేసిన సిక్స్ బెస్ట్ ఫుడ్స్.. ఇవి తింటే డాక్టర్ తో పనుండదు..!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar