Samantha: సమంత – నాగ చైతన్యల జంట గురించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ఇటీవల వారు విడాకులు తీసుకున్న సంగతి విదితమే. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికీ చర్చ జరగడం కొసమెరుపు. ఇక ఈ జంట విడిపోయి దాదాపు 5 నెలలు కావొస్తున్నా, వీరి డివోర్స్ ఇండస్ట్రీలో ఇప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంది. ఇక విడాకుల అనంతరం సినిమాల పరంగా ఇద్దరూ ఫుల్ బిజీ అయ్యారు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో నాగ చైతన్య దూసుకుపోతుంటే సమంత కూడా బాలీవుడ్ సహా హాలీవుడ్ ప్రాజెక్టులతో అదరగొడుతుంది.
Samantha: చైతుకు సమంత బిగ్ షాక్.. నెటిజన్లు ఫైర్!?
Samantha: చైతు ఇంకా సామ్ ని ఫాలో అవుతున్నాడా?
ఇకపోతే, విడాకుల అనంతరం సమంత భౌతికంగా మానసికంగా కూడా చైతూ జ్ఞాపకాలను చెరిపివేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుంది. ఈ కోవలోనే తన ఇన్స్టాగ్రామ్ నుంచి నాగ చైతన్య ఫోటోలను డిలీట్ చేసిన సామ్ రీసెంట్గా అతన్ని అన్‌ఫాలో కూడా చేసేసింది. అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున,రానా, వెంకటేష్ కుమార్తె ఆశ్రితలను ఇంకా ఫాలో అవుతున్న సామ్ చైతన్యను మాత్రమే అన్‌ఫాలో చేసింది.
Samantha: సమంతను ఇక ఎవరూ ఆపలేరు.. సామ్ యాక్షన్ సీన్స్ కోసం ఏకంగా హాలీవుడ్ ఫైట్ మాస్టర్!
మరి చైతు పరిస్థితి?
ఇదిలా ఉండగా మరోవైపు చై మాత్రం సమంతను ఇంకా ఫాలో అవుతున్నాడు. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం సమంతతో ఉన్న ఫోటోలను ఇంకా పదిలంగా దాచుకున్నాడు. ఇది గమనించిన సో కాల్డ్ అక్కినేని అభిమానులు చై ఇంకా సామ్ ని మర్చిపోలేదని తెగ ఫీల్ అయిపోతున్నారు. కాగా 2017, అక్టోబర్6న హిందూ, క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్న చై-సామ్ గతేడాది అక్టోబర్2న విడిపోయిన సంగతి తెలిసిందే.