Samantha: ప్రస్తుతం సమంత స్పీడు మాములుగా లేదు. సామ్ ప్రస్తుతం మునుపెన్నడూ లేని విధంగా సినిమాలు చేసుకుంటూ పోతుంది. ఏ ముహుర్తమున ఈ ముద్దుగుమ్మ ‘ఫామిలీ మ్యాన్’ సిరీస్ లో నటించిందో ఇక అక్కడినుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇక ఇటీవల పుష్ప సినిమాలోని ఓ ఐటెం సాంగ్ తో యువతను ఉవతను ఉర్రుతలూగించిన సంగతి తెలిసినదే. అలాగే సామ్ ప్రయోగాత్మక చిత్రాలు చేయడం కోసం ఎప్పుడూ సిద్దంగా ఉంటుంది.
Samantha: ఆ సీన్స్‌లో అదరగొట్టింది..సినిమాలో అవే స్పెషల్..!
Samantha: సామ్ కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్?
అవును మీరు వింటున్నది నిజమే. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఫీ మేల్ ఓరియెంటెడ్ ప్రాజెక్టు అయినటువంటి యశోదలో నటిస్తున్న విషయం అందరికీ విదితమే. ఈ సినిమాతో తనలోని యాక్షన్ టాలెంటును మరోసారి బయటపెట్టబోతుంది. దీనికోసం ఏకంగా హాలీవుడ్ స్టంట్ మాస్టర్ యానిక్ బెన్ సారథ్యంలో యాక్షన్ కొరియోగ్రఫీలో శిక్షణ తీసుకుంటోంది సామ్. ట్రాన్స్ పోర్టర్ 3, ప్రాజెక్టు 7, పారిస్ బై నైట్ ఆఫ్ లివింగ్ డెడ్, సిటీ హంటర్, క్రిస్టోఫర్ నొలన్ తెరకెక్కించిన ఇన్ సెప్షన్, డున్కిర్క్ లాంటి హాలీవుడ్ సినిమాలకు స్టంట్స్ కొరియోగ్రఫర్‌గా పని చేశాడు యానిక్ బెన్.
Samantha: ఈ సారి సమంతకు ఆ ఛాన్స్ ఇచ్చేదేలే అంటున్న సుకుమార్?!
మరింత సమాచారం:
యానిక్ బెన్ గురించి మాట్లాడుకోవాలంటే, షారుక్ ఖాన్ నటించిన రయీస్, సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ జిందా హై, పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది, మహేశ్ బాబు నటించిన వన్..నేనొక్కడినే చిత్రాలకు కూడా ఈయన పని చేశాడు. యానిక్ బెన్ ఇప్పటికే సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌కు స్టంట్స్ సమకూర్చాడు. తాజాగా మరోసారి యశోద కోసం పనిచేయడం విశేషం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!