NTR: యావత్ భారత సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పాన్ ఇండియా మూవీ RRR. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుందనే విషయం బాగా తెలిసిందే. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాను ప్రమోట్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏమాత్రం ఖాళీ లేకుండా బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాలన్నింటికీ చుట్టేస్తూ RRRను ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్గా RRR సినిమాకు సంగీతం అందించిన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణితో ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాల్గొన్నారు.
NTR: నాగార్జున సినిమాలో ఆ పాటంటే ఎన్టీఆర్‌కు చిరాకట.. తెలుసా?
NTR: యాంకర్ సుమ గురించి ఎన్టీఆర్?
ఇందులో కీరవాణి ఓ ఆసక్తికరమైన ప్రశ్నను వారిద్దరికీ. అదేమంటే యాంకర్ సుమకు మీ సినిమాల్లో ఏదైనా క్యారెక్టర్ ఇవ్వాల్సి వస్తే ఎలాంటి పాత్రను ఇవ్వడానికి మీరు సిద్ధంగా వున్నారు? అని కీరవాణి అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ బదులిస్తూ.. నాయనమ్మ, అమ్మమ్మలాంటి రోల్ ఇవ్వాలన్నారు. సుమను చూడగానే నిర్మలమ్మ, సూర్య కాంతం వంటి వాళ్లు పోషించిన గయ్యాలి పాత్రలు గుర్తుకు వస్తాయని తారక్ ఇక్కడ చెప్పడం కొసమెరుపు. సుమకు చాదస్తం ఎక్కువైందని, నోరేసుకుని పడిపోతుందని ఎన్టీఆర్ సుమ గురించి చెప్పారు. ఇకపోతే ఎన్టీఆర్, రాజీవ్ కనకాల స్నేహం గురించి తెలియంది కాదు.
NTR: రంగంలోకి దిగిన జూనియర్ NTR బావమరిది… !?
మరింత సమాచారం:
ఈ ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామాలో తెలంగాణ ప్రాంతానికి చెందిన గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించారు. అలాగే ఆంధ్ర ప్రాంతానికి చెందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించారు. ఇంకా ఈ చిత్రంలో ఆలియా భట్, అజయ్ దేవగణ్, ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి తదితరులు నటించారు. సుమారు 450 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి సినిమాను DVV దానయ్య నిర్మించారు.