NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తాజా స‌ర్వే… వైసీపీకి డేంజ‌ర్ బెల్స్‌…!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తూ.. తాజాగా ఓ స‌ర్వే వెల్ల‌డైంది. వ‌చ్చే ఎన్నికల్లో వైనాట్ 175 నినాదంతో దూసుకుపోతున్న అధికార పార్టీకి ప్ర‌జ‌లు బ్రేకులు వేయ‌నున్నార‌నేది ఈ స‌ర్వే సారాంశం. ప్ర‌ధానంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల విష‌యంలో వైసీపీ సాధించిన ప్ర‌గ‌తి ఏమీ క‌నిపించ‌డం లేద‌నే భావ‌న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. 22 మంది పార్ల‌మెంటు స‌భ్యులు ఉన్న‌ప్ప‌టికీ.. కేంద్రం నుంచి డిమాండ్ చేసి తెచ్చిన‌ది అంటూ ఏమీ లేక‌పోవ‌డాన్ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

తాజాగా.. ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ నిర్వ‌హించిన స‌ర్వే.. రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో సాగింది. ఈ స‌ర్వేలో సుమారు 30 వేల మంది నుంచి అభిప్రాయాలు సేక‌రించారు. ప్ర‌స్తుత రాష్ట్ర ప‌రిస్థితి వైసీపీ వ్య‌వ‌హారం.. ఎంపీల ప‌నితీరు వంటివాటిని భేరీజు వేసుకున్న‌ప్పుడు.. ప్ర‌జ‌ల నుంచి పెద‌వి విరుపులే క‌నిపించాయ‌ని స‌ర్వే సంస్థ వెల్ల‌డించింది. అయితే.. ప్ర‌భుత్వం చేసిన సంక్షేమం తాలూకు ప్ర‌భావం మాత్రం కొంత మేరకు ప్ర‌తిప‌క్షాల‌కు బ‌లంగా ఎదురు నిల‌వ నుంచి స‌ర్వే పేర్కొంది.

తాజా అంచ‌నా ప్ర‌కారం.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు, తెలుగుదేశం పార్టీ 10 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది. తెలంగాణ సహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేదా బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోవచ్చునని సర్వేలో తేలింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ జాతీయ పార్టీలు.. రెండూ ఒక్క సీటూ గెలుచుకునే అవకాశాలు లేవని ఒపీనియన్ పోల్ విశ్లేషించింది. అయితే.. ఇది టీడీపీ-జ‌న‌సేన పొత్తుపై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

2019 లోక్ సభ ఎన్నికల్లో 25 సీట్లకు గాను వైసీపీ 22, టీడీపీ 3 స్థానాల్లో గెలిచాయి. కానీ ఈసారి వైసీపీ 7 సీట్లు కోల్పోవచ్చునని.. ఇవి విశాఖ‌, కోస్తా, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని కీల‌క‌మైన స్థానాల‌ని స‌ర్వే సంస్థ వెల్ల‌డిం చింది. అవి టీడీపీ ఖాతాలో పడే అవకాశముందని సర్వే ఫలితాల్లో వెల్లడైంది. మొత్తంగా చూస్తే.. వైసీపీ ఎంపీల‌పై ప్ర‌జ‌ల్లో సానుకూల‌త లేద‌న్న విష‌యాన్ని స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టి నుంచి పోరాటం చేయ‌గ‌లిగితే.. త‌ప్ప వైసీపీ అనుకూల ప‌వ‌నాలు వీచే అవ‌కాశం లేద‌ని తెలిపింది.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju