Liger : లైగర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ సినిమా. విజయ్ దేవరకొండ – బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. లైగర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ లో విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్ సమర్పణలో పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
లైగర్ పాన్ ఇండియన్ సినిమాగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన రిలీజ్ డేట్ ని అధికారకంగా ప్రకటించారు పూరి టీం. సెప్టెంబర్ 9న పంచ్ కి రెడీగా ఉండండి అంటూ లైగర్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఇన్నాళ్లు అన్ని సినిమాల రిలీజ్ డేట్ ప్రకటిస్తున్నప్పటికి లైగర్ సినిమా అప్డేట్ రాకపోవడం తో ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ లో ఉన్నారు. ఎట్టకేలకి ఆ అప్డేట్ వచ్చేసింది. ఇక ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకి రానుందని సమాచారం.
Liger : పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా..!
ఇక ఇప్పటికే లైగర్ సినిమా ముంబై లో ఇప్పటికే 40 శాతం టాకీపార్ట్ కంప్లీట్ అయింది. విజయ్ దేవరకొండ తో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా లైగర్ ని తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాధ్. ఈ సినిమాకి 120 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయించినట్టు తెలుస్తోంది. పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ సినిమా అదే సమయంలో ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు ఇప్పటికే అఫీషియల్ గా ఈ సినిమాని ప్రకటించారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!