NewsOrbit
న్యూస్

గ్రీన్ జోన్ లో వ్యాపారులకు ఊరట

అమరావతి: కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు సడలింపు నేపథ్యంలో వివిధ వ్యాపార వర్గాలకు ఊరట కల్గించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో పలు దుకాణాలను తెరిచేందుకు ప్రభుత్వం గురువారం అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది.

కంటైన్‌మెంట్‌, బఫర్‌జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కూరగాయలు, పండ్లు, పాల దుకాణాలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించింది.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో షాపింగ్‌ మాల్స్‌కు అనుమతి లేదని స్పష్టం చేసింది. బంగారు ఆభరణాలు, వస్త్ర, చెప్పుల దుకాణాలకు కూడా అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా దుకాణ యజమానులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దుకాణాల వద్ద విధిగా శానిటైజర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చి 24వ తేదీ నుండి ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా వివిధ వ్యాపార వాణిజ్య సంస్థలు మూత పడిన విషయం తెలిసిందే.

కరోనా మహమ్మారి తగ్గుముఖం పెట్టకపోయినా దేశ, రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి కుదేలు అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దశల వారీగా లాక్ డౌన్ సడలింపులు ఇస్తుండటంతో అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తున్నది.

 

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Leave a Comment