Maadhavi Latha: మాధవీ లత వీర లెవల్‌లో ఎక్స్‌ఫోజింగ్ చేసినా ఆ సినిమా ఫ్లాపయింది..దాంతోనే ఆమె కెరీర్ కూడా క్లోజ్ అయింది..

Share

Maadhavi Latha: తెలుగమ్మాయి మాధవీ లత గురించి తెలియని వారెవరూ ఉండరు. అంతగా ఆమె సినిమాల పరంగా, ఆ తర్వాత సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా బాగా పాపులర్ అయింది. రవిబాబు దర్శకత్వంలో రూపొందిన సినిమా నచ్చావులే. ఈ సినిమాలో తనీష్ హీరోగా పరిచయం అయ్యాడు. అతనికి జంటగా హీరోయిన్‌గా మాధవీ లత సిల్వర్ స్క్రిన్‌కి హీరోయిన్‌గా పరిచయం అయింది. ప్రముఖ నిర్మాత రామోజీ రావు నిర్మించారు. మంచి ఫ్యామిలీ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన నచ్చావులే భారీ సక్సెస్ అందుకుంది.

maadhavi-latha-career even after exposing
maadhavi-latha-career even after exposing

నచ్చావులే సినిమాతో టాలీవుడ్‌లో అందరికీ తెగ నచ్చేసిన మాధవీ లత ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటుందని అందరూ భావించారు. యంగ్ హీరోలకి మంచి ఛాయిస్..చాలా కాలానికి చక్కటి తెలుగమ్మాయి తెలుగు తెరకి పరిచయం అయిందని చెప్పుకున్నారు. అలాగే నాని నటించిన స్నేహితుడా సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో నాని సరసన నటించింది. అయితే ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో నానికి జంటగా నటించిన కథ రిత్యా స్నేహితురాలిగా నటించింది. ఇదే తన కెరీర్‌కి పెద్దమైనస్ అవుతుందని మాదవీ లత ఊహించలేదు.

Maadhavi Latha: నానితో చేసిన స్నేహితుడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ సినిమాగా మిగిలింది.

ఈ సినిమాకి సత్యం బెల్లంకొండ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మొదటి సినిమా నచ్చావులే సినిమాలో ఎంత పద్దతిగా నటించిందో ఆ తర్వాత నటించిన స్నేహితుడా సినిమాలో అంతకు భిన్నంగా గ్లామర్ షో చేసింది. సాంగ్స్‌లో నాభి అందాలను స్కిన్ షోను బాగానే చేసింది. మాధవీ లతను ఇలా చూసిన జనాలు సినిమా ఇండస్ట్రీకి తగ్గట్టే తెలుగమ్మాయి ముంబై హీరోయిన్స్ ని మించి అందాల ఆరబోత బాగానే చేస్తుందని, ఖచ్చితంగా అమ్మడికి వరుసగా అవకాశాలు వస్తాయని చెప్పుకున్నారు.

చిన్న ఏజ్‌లో ఎంట్రీ ఇచ్చిన మాధవీ లత అందానికి అందం, మంచి పర్ఫార్మెన్స్, గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో ఏమాత్రం తక్కువ కాదని పేరు తెచ్చుకుంది. కానీ నానితో చేసిన స్నేహితుడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ సినిమాగా మిగిలింది. ఇది మాధవీ లతకి పెద్ద మైనస్‌గా మారింది. ఇండస్ట్రీలో స్టార్ హోదా దక్కించుకుంటుందని భావిస్తే రెండవ సినిమాతో ఆమె కెరీర్ దాదాపు క్లోజ్ అయింది. ఆ తర్వాత ఆమె ఎంత ప్రయత్నించినా హీరోయిన్‌గా స్టార్ హీరోల సరసన గానీ, పెద్ద నిర్మాణ సంస్థలలో గానీ అవకాశాలను దక్కించుకోలేకపోయింది. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లాంటి వారిని నోరు తెరిచి అవకాశం అడిగినా కూడా లాభం లేకుండా పోయింది. ఇక్కడ సక్సెస్ ముఖ్యం. తెలుగమ్మాయిలంటే ఎంతైనా కాస్త అవకాశాలివ్వడానికి ఆసక్తి చూపించరనేది మాదవీ లత విషయంలో కూడా రుజువైంది.

Maadhavi Latha: కొందరు తనకి కావాలనే అవకాశాలు రాకుండా చేస్తున్నారనేది మాధవీ లత వాదన కూడా.

ఒక్కసారి ఒక్క ఫ్లాప్ వస్తే ఇక మళ్ళీ ఆమెకి అవకాశాలివ్వడానికి ఎవరూ ముందుకు రారు. అలాంటిది అసలే తెలుగమ్మాయి..సక్సెస్ రాలేదు అంటే ఎవరూ ఇక ఆమె వంక చూడరు. కొన్ని సార్లు ఫ్లాప్స్ వచ్చినా ముంబై హీరోయిన్స్‌కి అవకాశాలు దక్కుతాయి. తెలుగు వాళ్ళకి మాత్రం ఆ ఛాన్స్ ఉండదు. నచ్చావులే, స్నేహితుడా సినిమాల తర్వాత మాధవీ లతకి ఏవో సినిమాలలో అవకాశాలు వచ్చాయి. కానీ అవేవీ ఆమెకి స్టార్ స్టేటస్ కాదు కదా, కనీసం ఈ సినిమాలో మాధవీ లత నటించిందనే గుర్తింపు కూడా లేకుండా పోయాయి. వెబ్ సిరీస్‌లలో స్టార్ హీరోయిన్స్, టాలెంటెడ్ హీరోయిన్స్ అవకాశాలు అందుకుంటున్నారు. కానీ మాధవీ లతకి మాత్రం సినిమా అవకాశాలు దక్కడం లేదు. కొందరు తనకి కావాలనే అవకాశాలు రాకుండా చేస్తున్నారనేది మాధవీ లత వాదన కూడా.


Share

Related posts

జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ ఆంక్షలు..! ఎందుకంటే.. ?

somaraju sharma

ఫోటో న్యూస్ : విజయవాడ లో భార్య తో దిల్ రాజు…!

arun kanna

`RRR` అంటే..?

Siva Prasad