Maha samudram: సినిమా రిలీజ్‌కు ముందు గొప్పలు పోతే మహా సముద్రం దర్శకుడు మాదిరిగా సారీ చెప్పాల్సి వస్తుంది..

Share

Maha samudram: ప్రతీ దర్శకుడుకి ఆయన రాసుకున్న కథ చాలా గొప్పగా అనిపిస్తుంది. అందులో సందేహం లేదు. అదే నమ్మకం కథ నరేట్ చేసినప్పుడు నిర్మాతలకు చెప్పి ఒప్పించుకుంటాడు. ఆ తర్వాత హీరో. హీరోకి కథ నచ్చితే ఇక పెద్దగా ఎవరినీ మెప్పించాల్సిన అవసరం ఉండదు. ఇక మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీ హీరోలకి కథ చెప్పాలంటే కాస్త కష్టమే. ఆ ఫ్యామిలీలలో సీనియర్ నటులు, నిర్మాతలు ఉన్నారు కాబట్టి ఎవరు నరేట్ చేయమన్నా తప్పకుండా కథ నరేట్ చేయాలి.

maha-samudram director says sorry to the audience
maha-samudram director says sorry to the audience

అంతేకాదు ఏవైనా కథలో లేక సన్నివేశాలలో, పాత్రలకి సంబంధించి సలహాలు ఇస్తే తీసుకోవాల్సిందే. ఏవైనా మార్పులు చేర్పులు చెబితే వినాల్సిందే. అందులో ఒకటి రెండు సినిమాలు చేసిన దర్శకులైతే తప్పనిసరిగా వారు చెప్పిన మార్పులు చేయాలి. ఈ ఏడాది వచ్చి 25 ఏళ్ళ డెబ్యూ హీరో రికార్డ్‌ను బ్రేక్ చేసిన ఉప్పెన సినిమా విషయంలో కూడా స్వయంగా మెగాస్టార్ కొన్ని మార్పులు చెప్పారు. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో ఆయన చెప్పిన మార్పులు.. సుకుమార్ ఇన్వాల్వ్ అయి మార్చారు. దాంతో ఉప్పెన సినిమా ఘన విజయాన్ని అందుకుంది. దర్శకుడిగా బుచ్చిబాబుకు భారీ క్రేజ్ తీసుకు వచ్చింది.

Maha samudram: ఇప్పుడు ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి పరిస్థితి కూడా అలానే అయింది.

ఇక కొంతమంది దర్శకులు చాలా ఓవర్ కాన్‌ఫిడెన్స్ తో అభిమానులకు ముందే ప్రామిస్ చేసేస్తారు. ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని…ఓ మైల్ స్టోన్ మూవీగా మిగులుతుందని..ఇలాంటి సినిమా మళ్ళీ రాదని.. ఇలా రక రకాలుగా మాట్లాడి రిలీజ్‌కు ముందు చాలా హైప్ క్రియేట్ చేస్తారు. దాంతో కామన్ ఆడియన్స్ కూడా సినిమా చూసేందుకు ఆరాటపడి మొదటి రోజు భారీ అంచనాలను పెట్టుకొని థియేటర్స్‌కి వస్తారు. తీరా సినిమా చూశాక దర్శకుడు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని ట్రోల్ చేయడం మొదలు పెడతారు. తప్పని పరిస్థితుల్లో దర్శకుడు నెటిజన్స్‌కు సారీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది.

ఇప్పుడు ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి పరిస్థితి కూడా అలానే అయింది. ఆయన దర్శకత్వంలో ఈ మధ్యనే మహా సముద్రం అనే సినిమా వచ్చింది. గత కొంతకాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న శర్వానంద్, కొన్నేళ్ళుగా టాలీవుడ్‌లో మంచి హిట్ కొట్టి ఇక్కడ అవకాశాలు అందుకోవాలనుకున్న సిద్దార్థ్ హీరోలుగా నటించారు. ఇప్పటికే కొన్ని సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్‌గా వెలగలేకపోతున్న అతిది రావు హైదరి, అనూ ఇమ్మానియేల్ వీరికి జంటగా నటించారు. ఇక జగపతి బాబు, రావు రమేశ్ లాంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటించారు. అజయ్ భూపతి మహా సముద్రం భారీ హిట్ కొడుతుందని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గొప్పగా చెప్పాడు.

Maha samudram: సినిమా ఏంటి భయ్యా అలా తీశావు.. చాలా నమ్మం పెట్టుకున్నాను..!

కానీ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో ఫ్యాన్స్,ఆడియన్స్ షాకై ఇంత నమ్మకంగా చెప్తే మహా సముద్రం ఇంత దారుణంగా ఫ్లాపయిందేంటీ అని మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు అజయ్ భూపతిని ఓ నెటిజన్ సినిమా ఏంటి భయ్యా అలా తీశావు..చాలా నమ్మం పెట్టుకున్నాను అంటూ సూటిగా అడిగేశాడు. దాంతో అజయ్ భూపతి..క్షమించండి.. మీ అంచనాలకు తగ్గట్టుగా సినిమా తీయలేకపోయాను. ఈ సారి తప్పకుండా మీ అందరికీ నచ్చే కథతో వస్తాను అని ట్విట్టర్‌లో సమాధానం ఇచ్చాడు. దాంతో ఇప్పుడు కొంతమంది సినిమా రిలీజ్‌కు ముందు అనవసరంగా గొప్పలు చెబితే ఇలాగే రిజల్ట్ తర్వాత సారీ చెప్పాల్సి వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

 


Share

Related posts

అక్టోబర్‌లో అధర్వ ‘బూమరాంగ్‌’

Siva Prasad

కొరటాల రాసుకున్న కథ కి అల్లు అర్జున్ సరిపోతాడా .?

GRK

Natasha Doshi Latest Poses

Gallery Desk