Mahesh Babu: స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రకటన గతేడాది జరిగింది. అయితే ఇప్పటివరకు ప్రీ-ప్రొడక్షన్ పనులపై కూడా సమాచారం లేదు. మహేష్ సర్కారు వారి పాట’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ భీమ్లా నాయక్ పైన దృష్టి పెట్టి ఉన్నాడు.
ఇక త్వరలో మహేష్ – త్రివిక్రమ్ సినిమా పట్టాలు లేకపోతుంది అనుకుంటున్న సమయంలో కోవిడ్ మూడవ రావడం అలాగే మహేష్ బాబు కూడా బారిన పడటం వెంట వెంటనే జరిగిపోయాయి. దీంతో ఈ చిత్రం ఎప్పుడు మొదలై… ఎప్పుడు విడుదల అవుతుంది అన్న విషయం పై సూపర్ స్టార్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే త్రివిక్రమ్ మాత్రం ఏప్రిల్ నుండి ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యాడట . ఈ లోపల ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేస్తారని సమాచారం. ఈ చిత్రం 2023 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా పెద్ద హీరో సినిమా మొదలైతే విడుదలయ్యేందుకు కనీసం సంవత్సరం రోజులు పడుతుంది. కానీ త్రివిక్రమ్ దర్శకుడిగా ఉంటే నిర్మాతలకు ఈ విషయంలో పెద్ద ఊరట లభిస్తుంది.
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అన్నింటినీ త్రివిక్రమ్ చూసుకుంటాడు. వాటన్నింటి పైన పూర్తిగా అవగాహన రానిదే షూటింగ్ మొదలు కాదు. ఇక త్రివిక్రమ్ ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్ స్టార్ హీరోలతో పని చేసిన నైపుణ్యం ఉన్న వాడు కాబట్టి ఈ సినిమా చాలా త్వరగా ముగించి సంక్రాంతి రేసులో నిలపడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ప్రొడ్యూసర్లు ఇలా తమకు డబ్బులు వృధా చేయని డైరెక్టర్లు వెంటపడుతుంటారు. వారిలో త్రివిక్రమ్ అందరి కంటే ముందు ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!