న్యూస్ సినిమా

Ram Charan: శంకర్ దెబ్బకి దిల్ రాజు అదిరిపోయేలా ఉన్నాడు..! ఒక్క పాటకి అంత ఏంది సామీ..?

Ram-Charan-Director-Shankar-and-Producer-Dil-Raju-collaborate-for-a-big-Film
Share

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి భారీ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ లో నటించారు. జనవరి 7 న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడటంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు.

 

Ram-Charan-Director-Shankar-and-Producer-Dil-Raju-collaborate-for-a-big-Film

ఇటీవలే మార్చ్ 18న లేదా ఏప్రిల్ 28న మూవీని రేలీజ్ చేస్తామంటూ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ టీం ప్రకటించారు. అలానే ఈ మూవీ తరువాత శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్లు మనకి తెలిసిన విషయమే.డైరెక్టర్ శంకర్ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుంటారు అలానే ‘ఆర్ ఆర్ ఆర్’ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.

రామ్ చరణ్ ,కియారా అద్వానీ ముఖ్య పాత్రలు గా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూసర్స్ దిల్ రాజు శిరీష నిర్మిస్తున్నారు.ఇందులో చరణ్ ఐఏఎస్ అధికారికగా, ముఖ్యమంత్రిగానూ కనిపించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన మరో షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.శంకర్ సినిమా అంటే మొదటి నుంచి గ్రాండీయర్ లుక్ ఉంటుంది. తన సినిమాలలో పాటల కి పెద్దపీట వేస్తారు అన్న విషయం తెలిసిందే. ప్రతి సినిమాలో పాటలకు చాలా ఖర్చు అవుతుంది కానీ ఈసారి ఏకంగా 25 కోట్లు పెట్టబోతున్నారు. అయితే ఇది రామ్ చరణ్ అభిమానులకు కన్నుల పండగ కానీ తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీసే దిల్ రాజు ఒక్క పాటకి 25 కోట్లు వెచ్చించడం అనేది ఇక్కడ చాలా పెద్ద విషయం.

ఇదే 25 కోట్లతో దిల్ రాజు ఒక సినిమాని తీస్తాడు. అలా తీసిన ఎన్నో సినిమాలు భారీ హిట్ లు సాధించాయి. పెద్ద హీరోలతో సినిమాలు చేసినప్పటికీ దిల్ రాజు ఇప్పటి వరకూ మరీ భారీ బడ్జెట్ సినిమాలు తీసింది లేదు. కానీ ఒక్కసారిగా శంకర్ తో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టడం… అటువైపు శంకర్ ఏ విషయం లో తగ్గకపోవడంతో సినిమా ఎలా ఉండబోతోంది… ఈ చిత్రం తర్వాత దిల్ రాజు పరిస్థితి ఈ సినిమా తర్వాత ఏమవుతుంది అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది.


Share

Related posts

YSRCP: సొంత గూటికి చేరేందుకు ఆ టీడీపీ మాజీ మంత్రి ప్రయత్నాలు ఫలించేనా..!?

somaraju sharma

రవితేజ గురించి రాజమౌళి చెప్పింది విని షాకైన ఆ డైరెక్టర్..!!

sekhar

శ్రీముఖి గుండెల్లో ఏముందో కళ్లల్లో తెస్తుందంటున్న జానీ మాస్టర్?

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar