మెగాస్టార్ చిరంజీవి అంటేనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మైలురాయి. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక చరిత్ర. టాలీవుడ్ కు ఒక ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తి. అటువంటి మెగాస్టార్ తో అక్కినేని కోడలు సమంత.. దోశ చేయించింది. నమ్మరా.. అందుకే మీకోసం వీడియోను కూడా తీసుకొచ్చాం.

కాకపోతే అది ఓ షోలో. అదేనండి.. సామ్ జామ్ అంటూ ఆహా ఓటీటీలో వస్తుంది కదా ఓ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ లో తాజాగా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఇప్పటికే విజయ దేవరకొండ, రానా, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి సెలబ్రిటీలు ఈ షోకు వచ్చారు.
తాజాగా ఈ షోకు వచ్చిన మెగాస్టార్ తో సమంత.. దోశ ఫ్లిప్ చాలెంజ్ ను చేయించింది. అంటే.. లాక్ డౌన్ సమయంలో.. మెగాస్టార్ చేసిన దోశ తెగ ఫేమస్ అయిపోయింది. అదే చాలెంజ్ ను ఇప్పుడు సమంత మళ్లీ మెగాస్టార్ కు విసిరింది. దీంతో మెగాస్టార్ కళ్లకు గంతలు కట్టుకొని మరీ.. ఈ దోశ చాలెంజ్ లో పాల్గొన్నారు.
దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా ఆహా యూట్యూబ్ చానెల్ లో విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా మెగాస్టార్ దోశను ఎలా ఫ్లిప్ చేశారో చూడండి.