NewsOrbit
Featured న్యూస్ సినిమా

Chiranjeevi: ఫ్లాప్ డైరెక్టర్, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో మెగాస్టార్ సాహసం..ఇది వర్కౌట్ అవుతుందా అంటూ సందేహాలు..

Chiranjeevi: ఇండస్ట్రీలో కొత్త వారికి ఎవరో ఒకరు అవకాశాలిస్తేనే దర్శకుడిగానో, హీరోగానో, మ్యూజిక్ డైరెక్టర్‌గానో సక్సెస్ అవుతారు. అప్పుడే కొత్త టాలెంట్ అనేది ఇండస్ట్రీకి వస్తుంది. ఇక వరుసగా ఫ్లాప్ సినిమాలు చేసిన దర్శకుడు కొంతకాలం వరకు ఇండస్ట్రీలో కనిపించకపోతే సాధారణంగా ఆ దర్శకుడిని ఎవరూ పట్టించుకోరు. అప్పటికే సినిమాలు చేసిన నిర్మాతలైనా, హీరోలైనా మొహం చాటేస్తారు. ఇలా జరిగి ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది దర్శకులు దూరమయ్యారు. అలాంటి ఓ డైరెక్టర్‌కి మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ లైఫ్ ఇవ్వబోతున్నారు.

megastar Chiranjeevi experiment with young music direcctor
megastar Chiranjeevi experiment with young music direcctor

తమిళంలో పెద్ద హిట్ సాధించిన వేదాళం రీమేక్ మెగాస్టార్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో భోళా శంకర్‌గా రూపొందించబోతున్నారు. ఇందులో హీరోయిన్‌గా తమన్నా, మెగాస్టార్‌కి చెల్లిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటించబోతున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కు ఓ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌ను ఎంచుకొని షాకిచ్చారు మెగాస్టార్. గతంలో అగ్ర సంగీత దర్శకులతో పనిచేస్తున్న చిరు మణిశర్మకి సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చి గొప్ప లైఫ్ ఇచ్చారు. సంగీత దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన
మెగాస్టార్ ఆ తర్వాత ఎన్నో సినిమాలకి సంగీత దర్శకుడిగా అవకాశం కల్పించారు.

Chiranjeevi: గత కొంతకాలంగా మణిశర్మకి అవకాశాలివ్వలేదు.

ఇప్పుడు ఆయన తనయుడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగర్‌కు కూడా చిరు గోల్డెన్ ఆఫర్ ఇచ్చారు. నిజంగా ఈ అవకాశం దక్కుతుందని మహతి ఎంతమాత్రం అనుకొని ఉండడు. ఇప్పటి వరకు మహతి సంగీతం అందించింది అన్ని మీడియం రేంజ్ సినిమాలే. అది కూడా నితిన్, నాగ శౌర్య లాంటి యంగ్ హీరోల సినిమాలకే పనిచేశాడు. అలాంటి మహతికి మొట్టమొదటిసారి అవకాశం మెగాస్టార్ గొప్పతనం. ఇది చాలా మంది నమ్మలేకపోతున్నారు. ఆచార్య సినిమాతో మళ్ళీ మణిశర్మకి అవకాశం ఇచ్చారు మెగాస్టార్. గత కొంతకాలంగా మణిశర్మకి అవకాశాలివ్వలేదు.

అలాంటిది ఒకేసారి అటు తండ్రి, ఇటు కొడుకును ఎంకరేజ్ చేయడం నిజంగా ఆసక్తికరంగా మారింది. ఆచార్య సినిమాకి మణిశ్రమ, గాడ్ ఫాదర్ సినిమాకి థమన్, భోళా శంకర్ సినిమాకి మహతి సంగీత దర్శకులు. ఇంకో సినిమాను బాబి దర్శకత్వంలో చేయబోతున్నారు మెగాస్టార్. ఇంకా ఈ సినిమాకి సంగీత దర్శకుడిని ఎంచుకోవాల్సి ఉంది. అయితే మెగాస్టార్ తలుచుకుంటే ఎం.ఎం.కీరవాణి, ఏ.ఆర్.రెహమాన్ లాంటి వారు వచ్చి రెడీ అవుతారు. దర్శకుడు కావాలంటే రాజమౌళి వంటి వారు కాదనరు.

Chiranjeevi: ఆయన సపోర్ట్ గట్టిగా ఉంటుందనే కారణంతో మహతికి సంగీత దర్శకుడిగా అవకాశం.

అలాంటిది ఎందుకు ఫేడవుట్ అయిన దర్శకుడితో..పట్టుమని పది సినిమాలకి కూడా సంగీతం అందించని చిన్న మ్యూజిక్ డైరెక్టర్‌కు అవకాశం ఇచ్చారనేది అందరికీ షాకింగ్‌గా అనిపిస్తోంది. అయితే మణిశర్మ కొడుకు కాబట్టి అవకాశం ఇచ్చినా ఆయన సపోర్ట్ గట్టిగా ఉంటుందనే కారణంతో మహతికి సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చి ఉంటారు. ఇక మెగాస్టార్‌కి మెహర్ రమేశ్ దగ్గరి బంధువు. అదీకాక కరోనా సమయంలో మెగాస్టార్ తలపెట్టిన సహాయక చర్యల కోసం బాగా కష్టపడ్డాడు. ఆ సమయంలో చాలా కథలు చిరుతో చర్చించాడట. అతని కసి పట్టుదల చూసి మెగాస్టార్ అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu