Most eligible bachelor : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ Most eligible bachelor అఖిల్ అక్కినేని పూజా హెగ్డే జంటగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ సినిమా. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్ పై బన్నీ వాసు వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా మొదలై చాలా నెలలు కావస్తుంది. కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయిన ఈ సినిమా మళ్ళూ లాక్ డౌన్ తర్వాత మొదలైనప్పటికి కొన్ని సీన్స్ మళ్ళీ రీ షూట్ చేయడం తో సంక్రాంతికి రిలీజ్ అనుకున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ పోస్ట్ పోన్ అయింది.
అఖిల్ కెరీర్ లో 4 వ సినిమాగా రాబోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మీద మంచి అంచనాలే ఉన్నప్పటికి ఆ తర్వాత అనూహ్యంగా తగ్గిపోయాయి. ముందు ఉన్న ఊపు ఆ తర్వాత కనిపించలేదు. దాంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా గురించి రక రకాల వార్తలు వచ్చాయి. అందుకు కారణం అఖిల్ నటించిన గత మూడు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడం కూడా ఒక కారణం. అంతేకాదు గత మూడేళ్ళుగా బొమ్మరిల్లు భాస్కర్ కి దర్శకుడిగా హిట్స్ లేక ఫాం కోల్పోయాడు. అందుకే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మీద కాస్త అంచనాలు తగ్గాయి.
Most eligible bachelor : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గుచ్చే గులాబి అన్న లిరికల్ ఒక్కసారిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా సమ్మర్ కానుకగా జూన్ 19 న రిలీజ్ కాబోతోంది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా ఒకవైపు నుంచి జరుగుతోంది. అందుకే మేకర్స్ మెల్లగా ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు. ఇప్పటి నుంచి ఈ సినిమా కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. ముందు రిలీజ్ అయిన ఈ సాంగ్ కి పాజిట్ రెస్పాన్స్ వచ్చి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చూడాలి మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అఖిల్ కి ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!