NewsOrbit
న్యూస్ సినిమా

MEB Review: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ రివ్యూ

MEB Review: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఈరోజు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని GA 2 వారు నిర్మించారు. అయితే ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం…

Akhil Akkineni and Pooja Hegde's Most Eligible Bachelor to hit the theatres  on October 8 - Movies News

కథ:

హర్ష ‘అఖిల్’ న్యూయార్క్ నగరంలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అయితే తన మైండ్ సెట్ కు తగిన అమ్మాయిని ను పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. ఎన్నో పెళ్లిచూపులు జరుగుతాయి. అయితే ఏ ఒక్కరూ తన ఆలోచనలకు సరిపడరు. ఇదే సమయంలో విభ (పూజా హెగ్డే) ఒక స్టాండ్ కమెడియన్ గా ప్రత్యక్షమౌతుంది. విభతో ప్రేమలో పడతాడు హర్ష అయితే కొన్ని అనుకోని సంఘటనల వల్ల అతను మళ్ళీ అమెరికాకు వెళ్లి పోవాల్సి వస్తుంది. ఇక విభకి కూడా హర్ష పైన నెగిటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. మరి తిరిగి హర్ష విభ ను పొందగలిగాడా? అసలు అతని ఆలోచనలకు తగ్గ అమ్మాయి ఉందా? ఇంతకీ అతనికి పెళ్లి అయిందా లేదా అన్నది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో అఖిల్, పూజా హెగ్డే నటన ఎంతో బాగుంది అంతే కాకుండా మొదటి అర్ధ భాగంలో వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి.

ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ సంగీతం మూడు పాటలు ఎంతో బాగా రాగా… ప్రధాన నటీనటులు కూడా చక్కగా నటించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా డీసెంట్ గా బాగుంది.

చిత్రంలో ఒక సెక్షన్ యూత్ ను ఆకట్టుకునే అంశాలు ఎన్నో ఉన్నాయి. యువతకు కావాల్సిన సందేశం వారిని టచ్ చేసే పాయింట్స్ కొద్ది మందిని మెప్పించవచ్చు.

Most Eligible Bachelor release pushed until October, due to Coronavirus  Pandemic | Telugu Movie News - Times of India

మైనస్ పాయింట్స్

మొదటి అర్ధ భాగంలో కోర్టు సీన్ హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ అసలు లాజిక్ లేకుండా సాగుతుంది. పైగా స్టాండప్ కమెడియన్ పాత్ర లో పూజా హెగ్డే నటన ఎంతో కృత్రిమంగా ఉంటుంది.

రెండవ అర్ధ భాగం మొత్తం సినిమాకి చాలా పెద్ద మైనస్. చివరి అరగంట సేపు బోధించడం మినహాయించి ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నివేశం ఒక్కటి అంటే ఒక్కటీ లేకపోవడం గమనార్హం

ఒకానొక సమయంలో అసలు సినిమాలో కథ ఉందా అన్న అనుమానం వస్తుంది. ఎంటర్టెన్మెంట్ జోడించి కథను చెప్పే ప్రయత్నం చేసిన దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి.

Pooja Hegde Receives Applauds For 'Most Eligible Bachelor'

విశ్లేషణ:

మొత్తంగా చూసుకుంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం థియేటర్ల వద్ద బోల్తా పడింది. కొంతమంది యువతరానికి ఇది సినిమా నచ్చవచ్చు. కానీ బి,సి సెంటర్లలో మాత్రం టికెట్లు పెద్దగా తెగకపోవచ్చు కామెడీ మెరిపించినప్పటికీ… కథ పెద్దగా లేకపోవడం, చివరి అర్ధగంట అసలు ఆసక్తికరంగా లేకపోవడం, రెండవ అర్ధ భాగం మొత్తం అనాస్తకిగా సాగడం మూవీని బాగా దెబ్బతీశాయి. మొదటి అర్ధ భాగంలో కామెడీ, సంగీతం, నటీనటులే ఇక ఈ చిత్రాన్ని కాపాడాలి.

చివరి మాట: ‘మోస్ట్ యావరేజ్ బ్యాచిలర్’

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu