బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికి అయన నటనతో కొన్ని కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అటు యాక్షన్ సినిమాలు, కుటుంబ కథా చిత్రాలతో పౌరాణిక సినిమాలలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను సంపాదించుకున్నాడు. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ వందకుపైగా సినిమాలలో నటించిన బాలకృష్ణకు ఎంతో మంది ప్రేక్షక అభిమానులు ఉన్నారు.
2007వ సంవత్సరంలో బాలకృష్ణ హీరోగా మహారథి సినిమాల్లో నటించారు. ఇందులో బాలకృష్ణకు జంటగా స్నేహ, మీరా జాస్మిన్ లు హీరోయిన్ల పాత్రలో నటించారు. మరొక ప్రముఖ హీరోయిన్ జయప్రద ఇందులో విలన్ పాత్రలో నటించడం మరొక విశేషం.. ఈ చిత్రాన్ని శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్ బ్యానర్ కింద వాకాడ అప్పారావు గారు నిర్మించారు. అయితే ఈ చిత్రం 2007లో విడుదలైంది. ఈ చిత్రం అప్పట్లో పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేక పరాజయం పాలైంది. అయితే ఈ సినిమా విడుదలై 13 సంవత్సరాలు అయినా ఆ చిత్రం నిర్మాణం కోసం చేసిన అప్పు ఇప్పటికి కడుతున్నా అని చిత్ర నిర్మాత అప్పారావు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
మహారథి చిత్రం షూటింగ్ సమయంలో కొంతమంది ఫైనాన్షియర్లు ముందుకు రావడంతో చిత్రం షూటింగ్ ప్రారంభించాం. అయితే కొన్ని కారణాల వల్ల ఫైనాన్షియర్ లు వెనక్కి తగ్గడంతో చాలా షాకింగ్ గా గురయ్యాను. చేసేదేమీ లేక సినిమా కోసం డబ్బు సమకూర్చుకునే పనిలో ఉండగా నా స్నేహితుడు బ్యాంకు నుండి 4 కోట్ల రూపాయలు లోన్ ఇప్పించాడు. దీంతో తిరిగి సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, 2007 లో ఈ చిత్రం విడుదలైంది. ఆశించినంతగా ఫలితాలు రాకపోవడంతో చాలా నష్టాలు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బ్యాంకుకి అప్పు కడుతూనే ఉన్నానని చిత్ర నిర్మాత వాకాడ అప్పారావు పేర్కొన్నారు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!