బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ అభిజిత్ జంట మధ్య సంభాషణ కొద్దిగా ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్ గా మారింది. చాలావరకు ఈ సీజన్లో చెప్పుకోతగ్గది ఏమీ లేదని ప్రేక్షకులు అంటున్న కానీ హౌస్ లో మోనాల్, అభిజిత్, అఖిల్ కాంబినేషన్ మధ్య ఉన్న వాతావరణం షో చూడటానికి ప్రేక్షకులలో కొంత ఆసక్తిని రేపుతోంది. ఇదిలా ఉండగా హౌస్ లో దాదాపు అందరూ పడుకున్న సందర్భంలో మోనాల్.. అభిజిత్ తో మాట్లాడుతూ…. అఖిల్ తో క్లోజ్ గా ఉంటే ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు వాడు నా కన్నా చిన్న వాడు వాడి మనసులో ఏమీ లేదని అభిజిత్ కి తెలిపింది.
నువ్వు గంటలకొద్ది దేత్తడి హారిక తో మాట్లాడితే తప్పులేదు కానీ నేను అఖిల్ తో క్లోజ్ గా ఉంటే తప్పు వచ్చేసిందా నువ్వు హారిక తో క్లోజ్ గా ఉంటే నేను ఏమైనా ప్రశ్నించినా అంటూ ఎమోషనల్ అయ్యింది. దీంతో అభిజిత్ మోనాల్ తో మాట్లాడుతూ….. కూల్ చేస్తూ…. నాకు నీ మీద ఉన్నా అభిప్రాయం డిఫరెంట్ అని అన్నాడు. హౌస్ లో ఎన్నడూ నా నుండి నీకు ఎలాంటి హాని కలగదని హామీ ఇచ్చాడు.
దీంతో ఈ ఎపిసోడ్ చూసిన వీక్షకులు మోనాల్ తో అభిజిత్ అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని అంటున్నారు. అంతేకాకుండా మోనాల్ మాట్లాడిన మాటలు హారిక వింటే బాధపడటం గ్యారెంటీ అని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అర్ధరాత్రి రెండు గంటల తర్వాత మోనాల్ అభిజిత్ మధ్య జరిగిన సంభాషణ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది అని బయట టాక్.