ప్రపంచపు అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ 4 ఎమోషన్స్, గొడవలు, అల్లరి తో సాగిపోతోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించిన అవినాష్ వచ్ఘీ రాగానే హంగామా మొదలు పెట్టేసాడు. అయితే కొంతమంది సభ్యులు అతడు అల్లరి మరీ ఎక్కువ అవుతుంది అని ఫీల్ అవుతున్నారు. ఇక మోనాల్ ను ఆటపట్టించేందుకు సరదా సంఘటనలు బయటకు తీసిన అవినాష్ కు మోనాల్, సోహైల్ షాక్ ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే సోహైల్ మోనాల్ ను అక్క అని పిలిస్తే అలా పిలువకు అలా పిలిస్తే 30 ఏళ్లకు పైబడి ఉందని అనుకుంటారు అని అనడం వివాదాస్పదంగా మారింది. నీకు నాకు మధ్య అంతటి క్లోజ్ నెస్ లేదు కాబట్టి నాతో మజాక్ చేయకు.. ఎలాంటి మజాక్ కి అయినా ఒక హద్దు ఉంటుంది నా గురించి మాట్లాడేటప్పుడు కంట్రోల్ గా మాట్లాడు అని చెప్పింది.
దానికి సొహైల్ స్పందిస్తూ నేను అలా అనడం వెనుక మరో ఉద్దేశం లేదని…. నీ మనసులో ఉన్న విషయాన్ని నాకు చెప్పావు కదా నాకు క్లారిటీ వచ్చింది అని అతను చెప్పాడు. మోనాల్ కూడా ఇలా చేయడం వల్ల మీతో నేను ఎలా ఉండాలో నాకు క్లారిటీ వస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే ఇదే అదే సమయంలో అవినాష్ అఖిల్, మోనాల్ లను ఇమిటేట్ చేస్తూ అనుకరిస్తూ కామెడీ చేశాడు. ఆ తర్వాత అవినాష్, మోనాల్ మధ్య హాట్ హాట్ డిస్కషన్ జరిగింది.
ఈ సందర్భంగా అవినాష్ కు మోనాల్ గట్టిగానే క్లాస్ పీకింది. బిగ్బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫాం అని దానిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని అనింది. ఒకసారి జోక్ వేస్తే సరే కానీ పదే పదే నన్ను టార్గెట్ చేస్తూ జోక్ లు వద్దు అని చెప్పడం గమనార్హం. ఇలా తను కొన్ని విషయాలను సరదాగా తీసుకోలేనని అవినాష్ మందలించడం గమనార్హం.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!