NewsOrbit
సినిమా

అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ .. టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌. మావయ్యలు మెగాస్టార్‌ చిరంజీవి, నాగబాబు, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఇన్‌స్పిరేషన్‌తో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు అల్లు అర్జున్‌. ఇప్పుడు అందరూ ఆయన్ని స్టైలిష్‌ స్టార్‌, డాన్సులు అదరగొట్టేస్తాడని, బన్ని యాక్టింగ్‌ సూపర్‌ అని అంటున్నారంటే .. బన్ని తనను తాను మలుచుకున్న తీరు అమోఘం. తెలుగు సినిమా రంగంలో రాణించాలనుకున్న చాలా మంది హీరోలకు బన్ని రోల్‌ మోడల్‌గా నిలుస్తున్నారు.

సక్సెస్‌ఫుల్‌ జర్నీ


చిరంజీవి ‘విజేత’లో బాలనటుడుగా మెప్పించిన బన్ని ఆ తర్వాత డాడీ చిత్రంలో కూడా డాన్సర్‌ పాత్రలో స్పెషల్‌ అప్పియరెన్స్‌తో అలరించారు. హీరోగా మాత్రం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘గంగోత్రి’ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఆర్యతో తొలి బ్రేక్‌ సంపాదించుకున్నారు. అ అంటే అల్లు అర్జున్‌ ఆ అంటే ఆర్య అనేంత రేంజ్‌లో ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించింది. అక్కడ నుండి బన్ని నెక్స్‌ట్‌ రేంజ్‌ హీరో అయిపోయారు. వినాయక్‌ బన్ని చిత్రంతో కమర్షియల్‌ హీరోగా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసిన అల్లు అర్జున్‌ హ్యాపితో మంచి విజయాన్ని దక్కించుకున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘దేశముదురు’తో మాస్‌ ఆడియెన్స్‌కు చేరువయ్యారు. అంతే కాకుండా టాలీవుడ్‌లో తొలి సిక్స్‌ ప్యాక్‌ హీరోగా ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. పరుగు చిత్రంతో కుటుంబ కథా ప్రేక్షకుల హృదయాలన గెలుచుకున్న బన్ని.. ఆర్య 2, వరుడు, బద్రినాథ్‌ చిత్రాలతో ఆకట్టుకున్నారు. జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, రేసుగుర్రం, రుద్రమదేవి, సరైనోడు, డీజే దువ్వాడజగన్నాథమ్‌, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలతో మెప్పిస్తూ స్టైల్‌ ఐకాన్‌లా నిలిచారు.

వైవిధ్యమైన పాత్రలకు ప్రాముఖ్యత

కేవలం హీరోగా తనే తెరపై కనపడాలనుకునే మనస్తత్వం బన్నిది కాదు. పాత్ర నచ్చితే అతిథి పాత్ర అయినా చేయడానికి తాను సిద్ధమనే హీరో అల్లు అర్జున్‌. అందుకు తొలి ఉదాహరణ వేదంలో బన్ని చేసిన కేబుల్‌ రాజు పాత్ర. అలాగే గమ్మునుండవో.. అంటూ గోనగన్నారెడ్డిగా బన్ని చేసిన పాత్ర రుద్రమదేవి చిత్రంలో హైలైట్‌గా నిలవడమే కాదు.. ఆయనకు ఫిలింఫేర్‌ అవార్డుని కూడా తెచ్చి పెట్టింది. ఈ పాత్ర బన్ని కెరీర్‌లో కూడా మరుపు రాని పాత్రగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

అల్లు అర్జున్‌ టు మల్లు అర్జున్‌


‘గంగోత్రి’ నుండి ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వరకు సినిమా సినిమాకి హీరోగా రేంజ్‌ పెంచుకుంటున్న అల్లు అర్జున్‌ మలయాళంలో మల్లు అర్జున్‌గా ఎంతో పాపులారిటీని సంపాదించుకోవడం విశేషం. ‘బన్ని’ నటించిన అన్ని సినిమాలూ మలయాళంలో ఘన విజయాలు సాధించడమే కాదు ‘బన్ని’ ఏ తెలుగు సినిమాలో నటించడానికి అంగీకరించినా మలయాళం రైట్స్‌ కోసం భారీ ఆఫర్స్‌తో మలయాళ నిర్మాతలు పోటీలు పడతారు. మలయాళ రంగంలో తనకంటూ ఓ స్పెషల్‌ మార్కెట్‌ని సంపాదించుకున్న తెలుగు హీరోగా అల్లు అర్జున్‌ ముందంజ వేశారు.

కోలీవుడ్‌ అవకాశాలు
దక్షిణాదిన అగ్ర హీరోగా ఎదుగుతున్న క్రమంలో ఇప్పుడు బన్ని కోలీవుడ్‌లో అవకాశాలు వస్తున్నాయి. ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులకు నచ్చేలా మంచి కథ దొరికితే తమిళంలో తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రం చేయడానికి బన్ని సిద్ధమే. అందులో భాగంగాతమిళ అగ్ర దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు.

సామాజిక సేవలో
కలెక్షన్స్‌ పరంగా తను పెద్ద హీరో అనే కాదు.. సాయం అందించడంలోనూ పెద్ద మనసున్న హీరో అల్లు అర్జున్‌ హుద్‌ హుద్‌, తిత్లీ తుపానులతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తన వంతుగా విరాలాలను ఇచ్చారు. పొరుగు రాష్ట్రం కేరళలో ప్రజలు వరదల వల్ల ఇబ్బంది పడితే వారికి విరాళం ప్రకటించడమే కాదు.. అక్కడి ప్రభుత్వం విరాళాల సేకరణకు ప్రత్యేకంగా నిర్వహించిన నెహ్రూ బోట్‌ ట్రోఫీ నిర్వహణకు కేరళ ముఖ్యమంత్రి పినరరు విజయన్‌ ప్రత్యేక ఆహ్వానం మేర ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

సోషల్‌ మీడియాలోనూ టాపే
సోషల్‌ మీడియాలోనూ దక్షిణాది హీరోల్లో ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ఉన్న హీరోల్లో అల్లు అర్జున్‌ ఒకరు. ఇందులో తన వ్యక్తిగత విషయాలతో పాటు, సినీ సంబంధిత విషయాలను, ఇతర సెలట్రిటీల శుభాకాంక్షలు చెప్పడం చేస్తుంటారు బన్ని.
అగ్ర దర్శకులతో వరుస సినిమాలు


టాలీవుడ్‌ అగ్ర దర్శకులైన త్రివిక్రమ్‌, సుకుమార్‌.. ఇద్దరితోనూ హ్యాట్రిక్‌ మూవీ చేస్తున్నారు అల్లు అర్జున్‌. జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రాలు తర్వాత హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతాఆర్ట్స్‌ బ్యానర్స్‌పై త్రివిక్రమ్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు బన్ని. బారీ బడ్టెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్‌ జరపుకోనుంది. అలాగే తన కెరీర్‌కు ఆర్యతో బ్రేక్‌ ఇచ్చిన దర్శకుడు సుకుమార్‌తో ఆర్య 2 తర్వాత హ్యాట్రిక్‌ మూవీగా ఓ సినిమా చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించబోయే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ రెండు చిత్రాలను 2019లోనే చిత్రీకరణ చేసేలా ప్లాన్స్‌ జరుగుతున్నాయి. అలాగే వేణు శ్రీరాం దర్శకత్వంలో ఐకాన్ కనపడుట లేదు సినిమాను అనౌన్స్ చేశారు. ఇలా వరుస సెన్సేషనల్‌ మూవీస్‌తో స్టార్‌ హీరోగా ఓ స్పెషల్‌ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు ఏప్రిల్‌8.

హ్యపీ బర్త్ డే టు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Leave a Comment