Rakul Preet Sing: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అందరికీ సుపరిచితులే. 2011వ సంవత్సరం కెరటం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఫస్ట్ టైం తమిళ ఇండస్ట్రీలో సపోర్టింగ్ రోల్ లో స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో 2011 వ సంవత్సరంలో హీరోయిన్ గా అడుగుపెట్టి.. వరుస ఆఫర్లు అందుకుంది. రామ్ చరణ్ తేజ నటించిన ధ్రువ లో.. హీరోయిన్ గా చేసి భారీ హిట్ అందుకోవడం జరిగింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ లో కూడా హీరోయిన్ గా చేయడం జరిగింది.
ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా.. అనేక అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ కన్నడ ఫిలిం “గిల్లీ” అనే మూవీకి ఫిలిం ఫేర్ అవార్డుకి నామినేట్ కావడం జరిగింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ పొడుగు కాళ్ల సుందరి రకుల్ ప్రీత్ సింగ్ … అభిమానుల తో చిట్ చాట్ చేయడం జరిగింది. వాళ్ళు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా తెలుగులో ఫేవరేట్ హీరో ఎవరు అని ఓ అభిమాని అడిగాడు. దానికి రకుల్ సమాధానమిస్తూ ఎప్పుడూ కూడా నాకు తెలుగులో ఒకే ఒక అభిమాన హీరో అల్ టైం ఫేవరెట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పింది.
అల్లు అర్జున్ తో రకుల్ ప్రీత్ సింగ్ సరైనోడు అనే సినిమాలో నటించడం జరిగింది. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. బన్నీ క్యారెక్టర్ కంటే సినిమా లో విలన్ పాత్ర చేసిన ఆది పినిశెట్టి పాత్ర .. హీరో కి తగ్గట్టు నువ్వానేనా అన్నట్టుగా ఉంటుంది. బన్నీ కి భారీ ఎత్తున మాస్ ఇమేజ్ సరైనోడు తీసుకొచ్చింది. ఈ సినిమాలో ఎమ్మెల్యే పాత్రలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ తనదైన శైలిలో నటించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తెలుగులో తనకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అని అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వటం జరిగింది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!