Animal: గత ఏడాది బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన సినిమాలలో “యానిమల్” ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. హీరో రణబీర్ కపూర్ తన నటనతో మరోసారి విశ్వరూపం చూపించాడు. తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో.. చాలా కొత్త తరహాలో సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమాతో వరుసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. దీంతో స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు ఒక పరాజయం లేని దర్శకుడిగా సందీప్ రెడ్డి జర్నీ కొనసాగుతోంది. కాగా “యానిమల్” సినిమా జనవరి 26 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ లో 15 మిలియన్ డాలర్ల క్లబ్బులో జాయిన్ కావడం జరిగింది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మూవీ ఓటీటీలో వచ్చినప్పటికీ.. థియేటర్లలో ఊహించని రెస్పాన్స్ వస్తుందని స్పష్టం చేయడం జరిగింది. “యానిమల్” భారీ హీట్ గా మలచినందుకు ఆడియన్స్ కి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. రణబీర్ కపూర్ తండ్రిగా అనిల్ కపూర్ అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. హీరోయిన్ రష్మిక మందన కూడా తన నటనతో ఎంతోమందిని మెప్పించింది. సెకండ్ హీరోయిన్ తిమ్రి దీప్తి కూడా ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. విలన్ పాత్ర చేసిన బాబి డియోల్ సినిమాకి హైలైట్ గా నిలిచాడు.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు తీయని విధంగా “యానిమల్” సినిమాని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించారు. యువతను ఎంతగానో ఆకట్టుకునే సన్నివేశాలతో..”యానిమల్” ధియేటర్ లో సందడి చేసింది. రణబీర్ కపూర్ కెరీర్ లోనే “యానిమల్” సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2023 ఏడాది రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాలలో టాప్ ఫైవ్ లో యానిమల్ నిలిచింది. దాదాపు 800 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మరోపక్క థియేటర్ లో ఇంకా కలెక్షన్స్ సాధించటం ఇండస్ట్రీ వర్గాలకు షాక్ కి గురి చేస్తూ ఉంది.