సినీ సెలబ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత విడిపోవడ అనేది సాధారణ విషయమే. పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే విడిపోతున్నారు. కారణాలేమైనా కావొచ్చు.. సెలబ్రెటీలు ఎక్కువకాలం కలిసి ఉండరు. సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండటం వల్ల కలిసి గడిపే టైమ్ చాలా తక్కువ ఉంటుంది. సెలబ్రెటీల మధ్య విడాకులకు ఇది కూడా ఒక కారణం కావొచ్చు.
అయితే కొంతమంది సెలబ్రెటీ కఫుల్స్ మాత్రం జీవితాంతం కలిసి జీవిస్తారు. ఇక కొంతమంది సెలబ్రెటీలు అయితే లవ్ ఎఫైర్స్, డేటింగ్, సహజీవనం పేరుతో కొద్దిరోజులు కలిసి ఉండటం, ఆ తర్వాత బ్రేకప్ అంటూ విడిపోతున్న కఫుల్స్ న మనం చూస్తూనే ఉన్నాం.
ఫ్యాషన్ డిజైనర్ తో లవ్
అయితే తాజాగా మర బాలీవుడ్ జంట పెళ్లికి సిద్ధమవుతోంది. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ గత కొంతకాలంగా ఓ ఫ్యాషన్ డిజైనర్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ప్యాషన్ డిజైనర్ నందితా మహ్తానీ, విద్యుత్ జమ్వాల్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే గత ఏడాది లండన్ లో వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని భావించారు. అంతేకాకుండా వీరికి నిశ్చితార్ధం కూడా పూర్తయినట్లు గతంలో వార్తలు వచ్చాయి.
లండన్ లో వివాహం
అయితే ప్రస్తుతం ఈ బాలీవుడ్ కఫుల్స్ జంట లండన్ లోనే ఉంటున్నారు. అక్కడ వెకేషన్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో ఇక అక్కడే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఎలాంటి హడావుడి లేకుండా కొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని ఏడడుగులు నడవబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై సోషల్ మీడియాలో ఈ కఫుల్స్ క్లారిటీ ఇచ్చే అవకాశముందట.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!