Anushka: స్వీటీ అనుష్క శెట్టికి గత కొంత కాలంగా అవకాశాలు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. “బాహుబలి” వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనుష్క నటించిన “సైజ్ జీరో” అట్టర్ ప్లాప్ కావటంతో పాటు… అనుష్క లావుగా కనిపించడంతో… కొద్దికొద్దిగా అవకాశాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి తో అనుష్క ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ చేస్తూ ఉంది. ఇటువంటి తరుణంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వీటీ అనుష్క పాల్గొని కాస్టింగ్ కౌచ్ గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
టాలీవుడ్ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఉందని స్పష్టం చేసింది. అవకాశాలు ఇస్తామని హీరోయిన్లను లంగా తీసుకునే వ్యక్తులు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నారని ఆరోపించింది. అటువంటి వారిని నేను కూడా చూశాను కానీ అలాంటివి.. ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు… ప్రతి ఇండస్ట్రీలో ఉన్నాయని స్వీటీ అనుష్క కామెంట్ చేసింది. కానీ నా విషయంలో ఇండస్ట్రీకి వచ్చిన నాటి నుండి చాలా స్ట్రైట్ గా మాట్లాడుతా.. అందుకే నాకు అటువంటి పరిస్థితి ఎదురు కాలేదు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో… అనేకమంది మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు నేను కూడా ఒప్పుకుంటున్నాను. అది నా మనస్తత్వం తెలిసిన దగ్గర ఎవరు కూడా అటువంటి విషయాలు చర్చించ లేదు అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అన్ని స్వీటీ అనుష్క వైరల్ కామెంట్ చేయడం జరిగింది. దాదాపు 3 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అనుష్క.. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంటూ తాజాగా కామెంట్లు చేయుట టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!