Sree Leela: టాలీవుడ్ యాక్టర్ శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా తెరకెక్కిన “పెళ్లిసందD” సినిమా లో హీరోయిన్ గా యాక్ట్ చేసిన “శ్రీ లీలా” కి జాక్ పాట్ ఆఫర్లు వస్తున్నాయి. విషయంలోకి వెళితే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ … ఇటీవల మారుతి దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా టైటిల్ రాజా డీలక్స్ అని కూడా అంటున్నారు.
అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లను డైరెక్టర్ మారుతి కన్ఫర్మ్ చేసినట్లు… ఆ ముగ్గురిలో ఒకరిగా శ్రీలీలా కి అవకాశం వచ్చినట్లు సమాచారం. హర్రర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది అని అంటున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు అతి తక్కువ టైంలోనే మారుతి ఈ సినిమా కంప్లీట్ చేయనున్నట్లు టాక్. ఒక ప్రభాస్ సినిమా లో మాత్రమే కాక త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో కూడా శ్రీలీలా అవకాశం అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
“పెళ్లిసందD” ఫస్ట్ సినిమా అయినా గాని శ్రీ లీలా … యాక్టింగ్ పరంగా అదేవిధంగా డాన్స్ పరంగా అద్భుతంగా నటించింది. దీంతో శ్రీ లీలా పై ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్ల దృష్టి పడినట్లు అర్థమవుతోంది. శ్రీ లీలా త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో…. మహేష్ మరదలిగా నటిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మొదటి సినిమా తర్వాత ఇండస్ట్రీలోని టాప్ మోస్ట్ హీరోలు ప్రభాస్, మహేష్ వంటి వారి పక్కన శ్రీ లీలా అవకాశాలు అందుకోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.