Samantha: బేసిగ్గా సమంతను టాలీవుడ్లో లక్కీలేడి అని అంటుంటారు. ఎందుకో మనందరికీ తెలిసినదే. అయితే ఆ అదృష్టం ఆమెను ఒక్కరోజులో వరించలేదు. ఎన్నో ఏళ్ళ కృషి తరువాతనే ఆమె యాక్ట్రెస్ గా నిలదొక్కుకుంది. ఇక సినిమా కధల విషయంలో ఆమెకున్న జడ్జ్ మెంట్ దర్శకులకు కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. ఏ ఇండస్ట్రీలోనైనా బలమైన సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి యాక్టర్స్ వస్తుంటారు. అయితే ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా అతి కొద్దిమందే సక్సెస్ అవుతారు. ఆ కోవకు చెందిందే సమంత.
Rudraksha : జపం చేసుకోవడం కోసం ఈ మాలలు వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది అని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి!!
Samantha: ఆమె జీవితంలో మచ్చుతునకలు ఇవే:
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఏ మాయ చేసావే’ సినిమాతో ఆమె యావత్ తెలుగు యువతను మాయ చేశారనే చెప్పుకోవాలి. దాంతో ఆమె కెరియర్ పరంగా సమంత వెనుదిరిగి చూసుకోలేదు. అదే ఏడాదిలో NTR జోడీగా ‘బృందావనం’ సినిమాలో చేసే మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తరువాత వచ్చిన ‘దూకుడు’ సినిమా సినిమా గురించి చెప్పుకోవలసిన పనిలేదు. దాని తరువాత రాజమౌళి దర్శత్వంలో వచ్చిన ‘ఈగ’ దుమ్ములేపిన సంగతి తెలిసినదే. ఇకపోతే ‘అత్తారింటికి దారేది’ సినిమా సమంతను ఏకంగా అందలమెక్కించింది.
Butter : పాలలో మీగడ బాగా కట్టి ,వెన్న రావాలి అంటే ఇలా చేయండి!!
సామ్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు:
‘మనం’, ‘రంగస్థలం’, ‘మజిలీ’, ‘యూ టర్న్’, ‘ఓ బేబీ’ చిత్రాలు ఆమెకు ఊపిరి ఆడనంత పేరుని తెచ్చి పెట్టాయి. ఇంతవరకు ఒకయెత్తు. ఇక ఇటీవల ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావా’ పాట మరో ఎత్తు. అంతవరకూ ఎవ్వరు ఊహించలేని విధంగా సామ్ ఐటెం సాంగ్ లో నర్తించి యావత్ తెలుగు మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసింది. ఇకపోతే ఆమె తీసుకున్న నిర్ణయాలే ఆమెను నేడు ఈ స్థితిలో ఉంచాయి. తాజాగా ఆమె పాన్ ఇండియా స్టార్ కేటగిరిలో చేరిపోవడం విశేషం. ‘యశోద’ .. ‘శాకుంతలం’ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానున్నాయి.