తెలుగులో ప్రసారం అవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటి వరకు ఈ షో రెండు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. తొలి సీజన్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే.. రెండో సీజన్‌కి నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే మూడో సీజన్‌కు వ్యాఖ్యాత మాత్రం అంత సులభంగా దొరకడం లేదు. దీంతో స్టార్ మా యాజమాన్యం స్టార్ హీరోలతో హోస్టింగ్ చేయించాలని గట్టిగానే ప్రయత్నాలు చేసింది. మూడో సీజన్ హోస్ట్‌గా ఎన్టీఆర్, వెంకటేష్ సహా నాగార్జున పేరు ప్రముఖంగా వినపడింది. అయితే ఇప్పుడు హీరోల స్థానంలో స్టార్ మా మేనేజ్మెంట్ ఓ స్టార్ హీరోయిన్‌తో బిగ్‌బాస్ సీజన్ 3ని హోస్ట్ చేయాలనుకుంటుందట. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు.. స్వీటీ అనుష్క అని వార్తలు వినపడుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుందట. మరి అంతా ఓకే అయితే విశేష అభిమానులను సొంతం చేసుకున్న అనుష్క ఎలా మెప్పించనున్నారో చూడాలి.
previous post
next post
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!