NTR: ఎన్టీఆర్ డై హార్ట్ ఫ్యాన్స్ తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ కు ఓ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఆయన అభిమానుల కోరిక తీర్చగలరా అంటే ..కొందరిలో సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం గతంలో పవన్ కళ్యాణ్ సినిమాకు అనిరుధ్ ఆశించిన మ్యూజిక్ ఇవ్వకపోవడమే. తాజాగా తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా, మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా బీస్ట్. ఈ సినిమాక్లు సంచలన దర్శకుడు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే, బీస్ట్ సినిమా కోసం ఆ చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ కంపోజ్ చేసిన ఓ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఈ పాటతో మరోసారి అనిరుధ్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రహమాన్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకుంది తమిళ ఇండస్ట్రీలో అనిరుధ్. తమిళంలో ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ సినిమాలకు అద్భుతమైన ఆల్బంస్ ఇచ్చాడు.
NTR: ఎన్టీఆర్ అభిమానులు కోరిక అనిరుధ్ తీర్చగలడా..?
ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం వచ్చిన 3 సినిమాలోను కొలవరి డీ సాంగ్ ఇంకా మోగూతూనే ఉందంటే అర్థం చేసుకోవచ్చు అనిరుధ్ ట్యూన్స్ ఏ రేంజ్లో ఉంటాయో. అయితే, ఎందుకో ఈ సంగీత దర్శకుడు తెలుగులో మాత్రం ఈ రేంజ్ క్రేజ్ తెచ్చుకోలేకపోతున్నాడు. కాగా, ఇప్పుడు కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న కొత్త చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ను ఎంపిక చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బీస్ట్ సినిమాలో తాజాగా వచ్చి బ్లాస్ట్ అయిన అరబిక్ పాట వంటిదే తమ హీరోకు కావాలని సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ అభిమానులు కోరిక అనిరుధ్ తీర్చగలడా లేదా చూడాలి.