ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాల్లో నటించి మెప్పించిన అవికాగోర్ న్యూయార్క్‌లో స్క్రీన్‌ప్లే కోర్స్ చదవడం కోసం సినిమా రంగానికి దూరమైంది. ఇప్పుడు కోర్స్ పూర్తి కావడంతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రీ బ్యాక్‌లో అవికాకు మంచి అవకాశమే దక్కింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అవికా `రాజుగారిగది 3`లో ప్రధాన పాత్రధారిగా నటించబోతున్నారు.
ఓంకార్ దర్శకత్వంలో సూపర్ హిట్ అయిన `రాజుగారిగది` ఫ్రాంచైజీలో మూడో పార్ట్‌గా `రాజుగారిగది3` సినిమా విడుదలవుతుంది. ముందు ఈ చిత్రంలో తమన్నాను హీరోయిన్గా అనుకున్నారు. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే స్క్రిప్ట్‌లో మార్పులు, చేర్పులు నచ్చక తమన్నా తప్పుకుంది. కాగా.. తర్వాత కాజల్‌ను సంప్రదించారు. కాజల్ రెమ్యునరేషన్ భారీగా ఉండటంతో ఓంకార్ అవికాగోర్ వైపు మొగ్గు చూపారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది.
previous post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!