బాలకృష్ణ 105వ చిత్రం `రూలర్`(వినపడుతున్న టైటిల్) బ్యాంకాక్‌లో సాంగ్స్ షూటింగ్ రేపటి నుండి ప్రారంభం కానుంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పటికే రజనీకాంత్ దర్బార్, మహేశ్ సరిలేరు నీకెవ్వరు, బన్నీ చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఇలాంటి సమయం కంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు రావాలని బాలకృష్ణ సినిమా దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అందుకోసమని ఈ ఏడాది కిస్మస్‌ను టార్గెట్ చేసుకుని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా సన్నాహాలు చేసుకుంటున్నారట.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!