తాజాగా బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ హోటల్ గా మారిన సంగతి తెలిసిందే. సర్వర్లు మరియు అతిథులు రెండు టీములుగా విభజించి టాస్క్ ఇచ్చిన ఈ గేమ్ లో…. గెస్ట్ గ్రూపులో మెహబూబ్, సొహైల్, హారిక, ఆరియనా, గంగవ్వ ఉన్న సంగతి తెలిసిందే. మిగతా ఇంటి సభ్యులు సర్వర్లు గా విధులు నిర్వహిస్తున్నరు. కాగా సర్వర్ల గ్రూపులో మేనేజర్ గా అభిజిత్ వ్యవహరిస్తున్నాడు.
అయితే ఈ టాస్క్ లో హోటల్ కి వచ్చిన అతిథులను మెప్పించి తమ పనులతో వారు ఇచ్చే టాస్క్ లను చేసి వారి దగ్గర స్టార్లు రాబట్టాలి ఇది బిగ్బాస్ గేమ్. అయితే గేమ్ లో భాగంగా మేనేజర్ గా ఉన్న అభిజిత్… మొన్నటివరకు కూల్ గేమ్ ఆడుతున్నట్టు వ్యవహరించిన తాజాగా మాత్రం అభివృద్ధి లో ఉన్న కక్కుర్తి బుద్ధి బయట పడిపోయింది.
సోహైల్ దగ్గర స్టార్ తీసుకోవడం కోసం… వాదిస్తూ ఇంకా హోటల్ నుండి అతిథులు వెళ్ళకముందే స్టార్ రేటింగ్ ఇవ్వాలని… అవసరమైతే తిప్పు వెనక్కి తీసుకోండి అంటూ అభిజిత్ మాట్లాడటం పై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎవరైనా వెళ్లేముందు రేటింగు ఇస్తారు అభిజిత్ ఏంటి మరీ దారుణంగా ఎక్కడికక్కడ గేమ్ ప్లానింగ్ చేస్తున్నాడు.. అంటూ మండిపడుతున్నారు. ఇదే తరుణంలో గెస్ట్ టీమ్ లో ఉన్న హారిక చాలావరకూ అభిజిత్ గ్రూప్ కి సపోర్ట్ చేస్తూ ఆడటం పై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. మొత్తంమీద చూసుకుంటే ఎక్కడికక్కడ అభివృద్ధి తన గేమ్ ప్లాన్ పక్కాగా వేసుకుంటూ వెళ్లిపోతున్నారని, ఎంటర్టైన్మెంట్ చేయకుండా వ్యవహరిస్తున్నాడని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.