చిరు తానిచ్చిన సలహాను పాటించలేదని బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. చిరంజీవి టైటిల్‌పాత్రలో నటించిన చిత్రం `సైరా నరసింహారెడ్డి`. అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. చిత్ర యూనిట్ ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్‌ను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ముంబైలో పర్హాన్ అక్తర్ చిరంజీవి, అమితాబ్‌లను ఇంటర్వ్యూ చేశాడు. ఓ సందర్భంలో చిరంజీవితో స్నేహం ఎలా మొదలైంది? అని అమితాబ్‌ను ప్రశ్నించగా, ఆయన మాట్లాడుతూ “హమ్ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవిగారిని కలిశాను. ఆరోజు నుండి మా స్నేహం మొదలైంది. ఆయన డ్యాన్స్ బాగా చేస్తారు. నేను చిరంజీవికి అప్పుడప్పుడు కొన్ని సలహాలు కూడా ఇస్తుంటాను. ఆయనే దాన్ని పాటించరు. రాజకీయాల్లోకి వెళ్లవద్దని చెబితే ఆయన నా మాట వినలేదు“ అన్నారు.
previous post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!