Allu Ramalingaiah: 2000 సంవత్సరంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సౌందర్య హీరోయిన్ గా “అన్నయ్య” సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి తమ్ముళ్ల పాత్రలో రవితేజ, వెంకట్ నటించారు. అప్పట్లో ఈ సినిమాకి రెండు నంది అవార్డులు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా అక్టోబర్ మొదటి తారీఖు ఉదయం అల్లు స్టూడియో ప్రారంభించారు. సాయంత్రం ఆయన రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఇంకా చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ.. కొణిదెల మరియు కుటుంబానికి చెందిన చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. అల్లు రామలింగయ్య తనతో ఎంత చనువుగా ఉంటారో దాని గురించి.. వివరిస్తూ “అన్నయ్య” సినిమా షూటింగ్ సెట్ లో ఆయన చేసిన కామెడీ తెలియజేశారు.
ఆ సినిమాలో “వాన వల్లప్ప వల్లప్ప ఒళ్లుపగించే సామెరంగా” అనే పాట షూట్ చేస్తున్నం. వాన సాంగ్ కాబట్టి తడిసిపోయి ఉన్నాం. సరిగ్గా ఆ సమయంలో అల్లు రామలింగయ్య గారు సెట్ లోకి వచ్చారు. సాంగ్ షూట్ మధ్యలో.. ఆయన పక్కనే కూర్చున్నాను. సాంగ్ షూటింగ్ కాబట్టి చాలా సరదాగా ఆయనతో మాట్లాడుకుంటూ ఉన్నాను. ఇంతలో ఆయన బాబు ఏం పాట అది అని నన్ను అడిగారు. దానికి నేను “వాన వల్లప్ప వల్లప్ప ఒళ్లుపగించే సామెరంగా” అనే సాంగ్ అని చెప్పాను. బాబోయ్ అది మా చిన్నప్పుడు వాన పడే టైంలో పాడుకునే వాళ్ళము, దాన్ని ఇంత రొమాంటిక్ గా రాశాడా..? లిరిక్ రైటర్..చాలా రొమాంటిక్ ఫెలో అంటూ అనురామలింగయ్య గారు అన్నారు. ఇక అదే సమయంలో అటు నుంచి ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు. ఆ టైంలో గిచ్చిందా..? అని అన్నారు. దానికి నేను మావయ్య గారు ఏంటి అర్థం కాలేదు అన్నాను. అప్పగించిందా..? అని.. అన్నారు మావయ్య గారు అర్థం కావటం లేదు అని అన్నాను. ఒళ్ళు అప్పగించిందా..? అనగానే అటువంటిది ఏమీ లేదు మామగారు.. అంటూ చాలా సరదాగా మాట్లాడుకునేవాళ్ళం.
ఆ రకంగా ఇద్దరి మధ్య.. ఫ్రెండ్లీ నేచర్ ఉండేది. నేను అల్లుడైన కానీ ఆయన నాతో స్నేహితుడు మాదిరిగానే ఉండేవాళ్ళు. అల్లు రామలింగయ్య గారికి డబ్బు సంపాదించే వ్యామోహం లేదు. ఇండస్ట్రీలో నిలదొక్కుకొని … ఈరంగంలో ముందుకు ఇంకా ఎలా వెళ్లాలి అనేదే ఆయన ఆలోచన. ఒకపక్క సినిమా రంగంలో నిలదొక్కుకుని మరోపక్క వ్యాపార రంగంలో కూడా రాణించాలని.. టాక్సీ కూడా అప్పట్లో నడిపించే వాళ్ళు. ఆ తర్వాత కొడుకు అరవింద్ నీ నిర్మాణ రంగంలో నిలబెట్టి అగ్ర నిర్మాతగా ఎదిగేలా చేశారు. ఇంక మనవాళ్లు బన్నీ హీరో అవ్వటం చూశారు. ఈ రకంగా ఆయన ఎక్కడో అక్కడ ఉండి ఇంతటి ఆనందాన్ని చూస్తూనే ఉంటారని నేను భావిస్తున్నాను అంటూ చిరంజీవి తనదైన శైలిలో తన మామయ్య అల్లు రామలింగయ్య గురించి సరికొత్త విషయాలు తెలియజేశారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!