ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోస్లో విజయ్ దేవరకొండ ఒకడు. యూత్‌లో ఈ హీరోకి క్రేజ్ ఓ రేంజ్లో ఉంది. ఈ క్రేజ్‌ను తన మార్కెట్‌ను విస్తరించుకోవడానికి కూడా విజయ్‌దేవరకొండ పనిలో పనిగా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. తన సినిమాలను దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్నాడు. ‘డియర్ కామ్రేడ్’ సినిమా నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. అలాగే విజయ్ తన తదుపరి సినిమాను కూడా నాలుగు భాషల్లోనే చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘డియర్ కామ్రేడ్’ విషయానికి వస్తే.. వందకోట్ల రూపాయలు కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘గీతగోవిందం’తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్ విషయంలో నిర్మాతలు నాలుగు భాషల్లో కలిసొచ్చేలా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిజానికి ముందుగా ఈ సినిమాను మే 31న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అదే సమయానికి సూర్య ‘ఎన్.జి.కె’ సినిమా రిలీజ్‌ను అనౌన్స్ చేశారు. తన సినిమాకు మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేసిన విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ విడుదలను వాయిదా వేసుకోవాలనే అనుకుంటున్నాడట. అంటే జూన్ ప్రథమార్థంలో సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.
previous post
next post