సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న చిత్రం `డియర్ కామ్రేడ్`. `ఫైట్ ఫర్ వాట్ యు లవ్` అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ఎమోషనల్ డ్రామా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. షూటింగ్ చివరి రోజున యూనిట్ చిన్న గెట్ టుగెదర్ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు. చిత్ర దర్శకుడు భరత్ కమ్మ సినిమా మేకింగ్‌లో భాగమైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
రీసెంట్గా విడుదలైన టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. జస్టిన్ ప్రభాకర్ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమాలో ఇప్పటి వరకు విడుదలైన పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
previous post
next post
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!