Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది “సలార్” సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కటం జరిగింది. అంతకుముందు దాదాపు 5 సంవత్సరాలు పాటు ఒక విజయం లేక కెరియర్ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. 2018లో “బాహుబలి: విజయం తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఒకసారిగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ సినిమాతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు. కానీ “బాహుబలి” తరహాలో ప్రభాస్ హిట్ అందుకోవడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. చివర ఆఖరికి గత ఏడాది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.
ఈ సినిమాలో దేవ పాత్రలో ప్రభాస్ నీ చాలా పవర్ఫుల్ రోల్ లో చూపించడం జరిగింది. సినిమాలో హీరోయిజం ఎలివేషన్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో 2023లో విడుదలైన అన్ని సినిమాల్లో కంటే రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమా కల్కి కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన “కల్కి2898AD” మే 9 వ తారీకు రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనె హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో దీపిక పదుకొనె వచ్చే అవకాశం లేనట్లు వార్తలు వస్తున్నాయి.
విషయంలోకి వెళ్తే దీపికా ప్రస్తుతం ప్రెగ్నెంట్. దీంతో ఆమె ఎలాంటి ప్రాజెక్టులు ఒప్పుకోవడం లేదు. ప్రెగ్నెన్సీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. ఈ క్రమంలో దీపిక “కల్కి2898AD” సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనటం డౌటే అనే టాక్ నడుస్తుంది. దీంతో ప్రభాస్ తో పాటు సినిమా యూనిట్ కంగారు పడుతూ ఉందట. ప్రభాస్ కెరియర్ లోనే ఈ సినిమా అత్యంత హై బడ్జెట్ మూవీ. ఈ సినిమాలో విలన్ పాత్రలో కమలహాసన్ నటించగా మరో కీలకమైన పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించడం జరిగింది.