Devatha Serial: చిన్మయి దేవితో ఆఫీసర్ అంకుల్ నీ పుట్టినరోజుకి లాగే నా బర్త్డే కూడా సర్ ప్రైజ్ ఇస్తానని చెప్పారుగా సార్ వస్తారేమో అని అంటుంది..! మనం ఎవరం సార్ తో మాట్లాడటం లేదు కదా ఎలా ఎప్పుడు వస్తారు అని అంటుంది దేవి.. ఆఫీసర్ అంకుల్ వస్తారు అని చిన్మయి ఎదురుచూస్తుంది.. నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటున్నాను అని దేవి నిద్రపోతుంది.. ఆదిత్య చిన్మయికి ఇచ్చిన మాట ప్రకారం.. 12 గంటలకు వచ్చి బెలూన్స్ ఎగరవేసి కేక్ కట్ చేయించి చిన్మయిని సర్ప్రైజ్ చేస్తాడు..!
ఉదయం చిన్మయిని లేపి వాళ్ళ అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంది. దేవి కూడా వాళ్ళ అక్కకి బర్త్డే విషెస్ తెలియజేసి ఆఫీసర్ సార్ రాత్రి వచ్చారా అని అడుగుతుంది. వచ్చారు కేక్ కట్ చేయించారు అని చెబుతుంది. రమ్య వచ్చి చిన్మయి రా నేను నీకు తలస్నానం చేయిస్తాను అని అని కుంకుడుకాయ నీళ్లు తన కళ్ళల్లోకి పోస్తుంది. అది చూసిన రాధ కోపం వచ్చి మీ ఆఫీసు పనులు నువ్వు చేసుకోవచ్చు కదా.. పిల్లల జోలి నీకెందుకు అయినా కంప్యూటర్ ముందు కూర్చుని టైప్ చేయడం అనుకుంటున్నావా.. కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయడమంటే అని అంటుంది రాధ. నేను చిన్మయి పిన్నిని నాకు చిన్మయి మీద హక్కు ఉంది అని అంటుంది. హక్కు ఉంది కదా అని పిల్లల్ని ఏమైనా చేస్తాను అంటే నేను ఊరుకోను అని రాధ అంటుంది.
ఇక పిల్లలిద్దరికీ రాధా నలుగు పిండి పెట్టి తల స్నానం చేయిస్తుంది. మాధవ్ పిల్లలకు బట్టలు తీసుకొని వస్తాడు ఒకరికి అమ్మాయి డ్రెస్ ఒకరికి అబ్బాయి డ్రస్సు తీసుకొస్తాడు. చిన్మయి నాకు కూతురు అయితే దేవి నాకు కొడుకు అని తన మనసులోని మాటను బయటపెడతాడు మాధవ్. దేవిని మీకు ఎలా దూరం చేయాలని నేను ఆలోచిస్తుంటే.. దేవికి ఇంకా దగ్గరవుతున్న మాధవ్ కు దేవిని రాధ ఎలా దూరం చేస్తుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.