Devatha Serial: అక్కాచెల్లెళ్ల అనుబంధాన్ని తెలియజేస్తూ మాటీవీ లో ప్రసారమవుతున్న ధారావాహిక దేవత సీరియల్.. బుల్లితెర ప్రేక్షకులను టీవీ లకు కట్టిపడేస్తుంది అనడంలో సందేహమే లేదు.. ఎందుకంటే దేవత సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో కార్తీకదీపం ను బీట్ చేసింది..!! నేడు ప్రసారం కానున్న 451 వ ఎపిసోడ్ హైలైట్స్ ఒకసారి చూసేద్దామా..!!
451 వ ఎపిసోడ్ హైలైట్స్..
మాధవా పిల్లల్ని ఆదిత్య చూడటానికి రావడానికి వీల్లేదని సత్య తో తెగేసి చెప్పేస్తాడు.. దాంతో సత్య తన బాధను తన అక్క రాధ తో చెప్పడానికి వెళుతుంది.. అక్క నువ్వేనా నేను పిల్లలు చూడడానికి, మాట్లాడడానికి ఒప్పుకోం అని చెబుతోంది. ఆ విషయం బావ కు నువ్వైనా నచ్చచెప్పు అని సత్య అంటుండగా.. పిల్లలు పుడతారు గా సత్యా అప్పటివరకు ఆదిత్య ఎలాగోలా ఆగమను అని చెబుతుంది.. మా పిల్లల మీద ప్రేమ చూపిస్తే నీకు ఇబ్బంది అని చెప్పగా.. అయినా మా పిల్లల మీద మీరు ప్రేమ చూపించే ఏంటి.. అని ప్రశ్నించగా.. సత్య అసలు మాకు పిల్లలు పుట్టారని.. ఆదిత్యకు ఏదో లోపం ఉందని ఆ విషయం డాక్టర్లు చెప్పిన తర్వాత నుంచే ఆదిత్య దేవికి ఇంకా దగ్గర అవుతున్నాడని.. దయచేసి ఈ విషయం నువ్వైనా నా అక్కలా అర్ధం చేసుకొని ఆదిత్య ను పిల్లల దగ్గరికి రానివ్వడానికి ఒప్పుకోమని.. సత్య బ్రతిమిలాడుతుంది. మీకు చేతులు ఎత్తి దన్నం పెడతాను అని సత్య అక్కడ నుంచి వెళ్ళిపోతుంది..
ఇక రాధ నాకు పిల్లలు పుట్టినప్పుడు ఆదిత్యకు లేని లోపం.. ఇప్పుడు ఆదిత్యకు ఎలా వస్తుంది..!? ఆదిత్య ఏమైనా కావాలని దాస్తున్నారా..!? దీని వెనక అసలు నిజం ఏదో ఉంది అని అనుకుంటుంది ఆలోచిస్తూ ఉండగా.. ఈరోజు ఎపిసోడ్ ముగిస్తుంది. ఇక ఆదిత్య కు నిజంగా ఏమైనా లోపం ఉందా..!? కావాలని దా..!? లేదంటే సత్యకు నిజంగా పిల్లలు పుట్టారన్న విషయం రాధ తెలుసుకుంటుందా..!? అని తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..