Family Star: విజయ్ దేవరకొండ నటించిన “ఫ్యామిలీ స్టార్” సినిమా నేడు రిలీజ్ అయింది. తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలయ్యింది. మొదటి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేమ కథ నేపథ్యంలో కుటుంబ ప్రేక్షకులను అలరించే సినిమాగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. సినిమాలో సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని టచ్ చేసే విధంగా ఉందని సినిమా ఓవరాల్ గా హిట్ అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు ఊహించని విధంగా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా చాలా చోట్ల డ్యాన్సులు కూడా వేశారు.
“ఫ్యామిలీ స్టార్” విజయం సాధించడానికి నిర్మాతగా దిల్ రాజు గతంలో ఎన్నడూ లేని విధంగా కష్టపడ్డారు. ఈ క్రమంలో లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలుగు ఇండస్ట్రీకి ఫ్యామిలీ స్టార్ ఎవరు? అంటూ మీడియా ప్రతినిధి ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి అని దిల్ రాజు స్పష్టం చేశారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిరంజీవి గారి ఎదుగుదల ఎంతోమందికి ఆదర్శమని అన్నారు. చెన్నైలో యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి నేర్చుకుని విలన్ వేషాలు వేసి తర్వాత హీరోగా రాణించారు. ఆ సమయంలోనే సుప్రీమ్ హీరోగా పేరు సంపాదించుకున్నారు.
అనంతరం మెగాస్టార్ చిరంజీవిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మాత్రమే కాదు తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ ఎంతోమంది ఆ కుటుంబం నుండి రావటం చాలా గ్రేట్ అంటూ.. చిరంజీవిపై దిల్ రాజు పొగడ్తల వర్షం కురిపించారు. గత ఏడాది “ఖుషి” సినిమాతో హిట్ అందుకోవడం జరిగింది. ఈ ఏడాది “ఫ్యామిలీ స్టార్” తో విజయ్ దేవరకొండ విజయ మంది పోవటంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.