Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన నటించిన సినిమాలలో ఈయనకి ఎంత క్రేజ్ వస్తుందో చెప్పలేము కానీ వీరుతో ఉన్న వారికి మాత్రం భారీ రేంజ్ లోనే గుర్తింపు దక్కుతుంది. పవన్ కి చెల్లి, అక్క, అమ్మ ఇలా అనేక పాత్రలలో నటించిన వారు ప్రస్తుతం టాలీవుడ్ నే ఏలుతున్నారు కూడా.
ఇక నటి వాసుకి అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లెలు అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, వాసుకి మధ్య ఉన్న అనుబంధానికి ఎంతోమంది అభిమానులు ఫిదా అయ్యారు. అలాగే వీరిద్దరి మధ్య ఉన్న సన్నివేశాలు కూడా ఎంతోమందిని ఆకట్టుకున్నాయి.
అంతలాగా ప్రేక్షకుల మదిలో నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. ఒక ఫిల్మ్ వండర్ లా ఒక సినిమాకే పరిమితమైంది. చాలా సంవత్సరాల తరువాత మళ్లీ ఇండస్ట్రీకి ర్రీ ఎంట్రీ ఇచ్చి.. అటు వెండితెరపై ఇటు వెబ్ సిరీస్ లో కూడా తన సత్తాను నిరూపించుకుంటుంది. ఇక తాజాగా రిలీజ్ అయిన #90s middle class biopic లో తల్లి పాత్రలో నటించి గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందింది.
ఇక ఈమె పుట్టి పెరిగింది అంతా చెన్నైలోనే. రామణి వర్సెస్ రామణి, మర్మదేశం అనే సీరియల్స్ తో చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక అనంతరం తొలిప్రేమ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఇక ప్రస్తుతం మళ్లీ ఇండస్ట్రీలోకి ర్రీ ఎంట్రీ ఇచ్చి తన నటనతో మరోసారి దూసుకుపోతుంది.