Elon Musk: ప్రస్తుత కాలంలో యూట్యూబ్ కి ఏ విధమైన ఫాలోయింగ్ ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం. కొందరు యూట్యూబ్ ద్వారా వినోదాన్ని పొందుతుంటే మరికొందరు మాత్రం డబ్బులు సైతం సంపాదిస్తున్నారు. యూట్యూబ్ వీడియోస్ చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. అలా యూట్యూబ్ ద్వారా ఎంతోమంది స్థిరపడుతూ వస్తున్నారు. ఇక ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మాస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తరువాత అనేక మార్పులు చేసేందుకు ప్రయత్నం చేపట్టాడు. ఈ క్రమంలో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ కు దీటుగా ప్రత్యేక వేదికను తెచ్చేందుకు సిద్ధమయ్యాడు. యూజర్ల హైక్వాలిటీ వీడియోలు అప్లోడ్ చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా టీవీ యాప్ ఎక్స్ టీవీ యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎక్స్ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు. ఎక్స్ టివి యాప్ యూజర్ ఇంటర్ ఫేస్ కూడా యూట్యూబ్ మాదిరిగానే ఉండనున్నట్లు సమాచారం.
” చిన్న తెర నుంచి పెద్ద తేరా వరకు.. ఎక్స్ అన్నిటిని మార్చేస్తుంది. ఎక్స్ టీవీ యాప్ తో నూతన, ఆకర్షమైన కంటెంట్‌ను మీ స్మార్ట్ టీవీలలోకి త్వరలో తీసుకురానున్నాం. పెద్ద స్క్రీన్ లపై అత్యంత నాణ్యమైన కంటెంట్.. అందులో లీనమయ్యే అనుభవాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ఇది రూపొందుకుంటుంది ” అంటూ ఎక్స్ సీఈవో తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నాడు. ఇక టీవీ యాప్ విషయాలతో పాటు ఇంటర్ ఫేస్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని సంబంధించిన వీడియోను ఈయన పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఏక తన ప్రయత్నాలు అంతా యూట్యూబ్ ని తలదన్నేందుకే అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం యూట్యూబ్ ఏ రేంజ్ ప్రేక్షక ఆదరణ పొందుతూ దూసుకుపోతుందో మనందరికీ తెలిసిందే.
ఉచితమైన కంటెంట్లు మరియు సినిమాలను అందిస్తూ కొందరికి కెరీర్ ని మార్చే బిగ్గెస్ట్ ప్లాట్‌ఫామ్ గా కూడా ఉంది. షార్ట్ ఫిలిమ్స్ మరియు ఇతర వాటిలో యూట్యూబ్ ప్రతి ఒక్కరికి సహాయపడుతుంది. కొన్ని సంవత్సరాలుగా ఎవరికి ఏ డౌట్ వచ్చినా ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లోనే తమ డౌట్స్‌ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. ఇక ఇప్పటికీ కూడా యూట్యూబ్‌ని అలరించేవారు కోట్లలో ఉంటారు. ఇక అటువంటి వారిని డైవర్ట్ చేసుకునేందుకు ఎక్స్ సీఈవో సర్వ విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక వీరు రూపొందిస్తున్న ఈ యాప్ కూడా కొంచెం ఊపందుకున్న రానున్న రోజుల్లో మంచి స్థాయికి ఎదుగుతుందని చెప్పుకోవచ్చు.
మొదటిగా ఉచితమైన కంటెంట్లు మరియు వినోదాన్ని ఇచ్చే వెబ్ సిరీస్ ను విడుదల చేస్తూ ఉంటే తమ ప్లాట్ ఫామ్ ని ముందుకు తీసుకు వెళ్ళవచ్చు. ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా రివ్యూలు మరియు షార్ట్ ఫిలిమ్స్ అదే విధంగా ఇతర వీడియోస్ చేస్తూ కొంతమంది లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇక ఇప్పుడు ఉన్న టాలీవుడ్ యాక్ట్రెస్ లో కొందరు యూట్యూబ్ నుంచి వచ్చినవారే. నవీన్ పోలిశెట్టి, సుహాస్ ఇలా ఎంతోమంది నటీనటులు యూట్యూబ్‌లో తమ అదృష్టాన్ని మొదటిగా పరీక్షించుకుని అనంతరం సినిమాల్లోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం వీరి కెరీర్ మంచి ఫ్లోలో కొనసాగుతుంది. ఇక వీరే కాకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని ఇస్తూ భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు.
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!