ప్రేక్షకులను తమ వైపు తిప్పుకుంటూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ కవ్విస్తూ ఎంతో మంది అభిమానుల మనసును దోచుకుంటున్న షో జబర్దస్త్ కతర్నాక్ కామెడీ షో.. నవ్వుల పువ్వులు పూయిస్తున్న జబర్దస్త్ అనతి కాలంలోనే ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణను సంపాదించుకుంది. ఇందులో పాటిస్పేట్ చేసే కంటెస్టెంట్ల పంచులు, జోకులు చూస్తుంటే నవ్వు ను ఆపుకోలేరు. కామెడీ తోపాటుగా, అందులో ఉండే సారాంశం మాత్రం అందరి మనసును కదిలిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కదా టైం అయిందంటే చాలు ఈ టీవీ ముందు తిష్టవేసేస్తుంటారు. మీరు కూడా ఇందులో భాగమని తెలుసండోయ్.. జబర్దస్త్ నవ్వుల పువ్వులను పూయించడంతో పాటుగా ఎమోషనల్ గా కూడా జనాలను భావోద్వేగానికి కూడా గురి చేస్తుంటుంది.
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దారుణాలను, ఘటనలు ఎన్నింటినో స్కిట్ ల రూపంలో ప్రదర్శిస్తూ అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంటుంది. అయితే నవ్వులతో అందరినీ అలరించే జబర్దస్త్ వచ్చేవారం అందరినీ కంటతడి పెట్టించబోతోంది. అదేంటి అందరినీ నవ్వించే షో లో కంటతడి ఏంటని అనుకుంటున్నారా.. అది నిజమేనండోయ్.. చిన్న పిల్లలతో అల్లరి చేస్తూ వారి అల్లరిని నవ్వులుగా మార్చి స్కిట్ చేసి అందరి చేత షభాష్ అనిపించుకుంటున్న రాకేశ్ వచ్చే వారం అందరినీ ఎమోషనల్ చేయబోతున్నారు. దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న అన్నదాత పడుతున్న కష్టాలను చూపించబోతున్నాడు రాకేశ్.
అందులో రైతు సామాజికంగానూ, ప్రకృతి ప్రకోపం తో అతి వృష్టి, అనావృష్టి వలన చేతి కొచ్చిన పంట నిర్దాక్షిణంగా పాడైపోతే ఆ రైతు పడే బాధను, ఆవేదనను రాకేశ్ ఈ స్కిట్ లో చూపించబోతున్నాడు. అది చూసి జబర్దస్త్ జడ్జీలు కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే ఈ షోలో రష్మీ మరియు సుధీర్ కలిసి స్కిట్ చేసి అందరినీ నవ్వించాడానికి సిద్దమయ్యారు. ఈ స్కిట్ మగధీర కు స్పూఫ్ గా ఉండనుంది. అంటే ఈ స్కిట్ లో సుధీర్ ‘ఖాళీ బీరువా(కాలభైరవకు స్పూఫ్)’ గా, ఇత్తడి బిందె(మిత్రవిందకు స్పూఫ్) గా రష్మి కనిపించి అందరినీ కడుపుబ్బా నవ్వించడానికి సిద్దమయ్యారు.
మరి ఇందులో గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ ఏ గెటప్ లల్లో కనిపిస్తారో ప్రోమో చూస్తేనే మనకు తెలసిపోతుంది. అలాగే జీవన్ స్కిట్ లో ఎంతో యాక్టీవ్ గా ఉండే రిత్విక తన అదిరిపోయే పంచులతో అదరగొట్టేసింది. అలాగే కెవ్వు కార్తీక్, బుల్లెట్ భాస్కర్ కిట్లు అందరినీ అలరించబోతున్నాయి. ఈ నవ్వులు వచ్చే శుక్రవారం(డిసెంబర్ 4) న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి అ ప్పటిదాక ఆగకుండా ఉండలేమంటే మాత్రం ప్రోమో చూసేసి కాసేపు నవ్వుకోండి..!
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!