గుత్తాజ్వాల పేరు తెలియని వారు క్రీడా ప్రపంచంలో చాలా తక్కువ మందే ఉండుంటారు. ఈమె భర్త నుండి విడిపోయి చాలా కాలమే అవుతుంది. అప్పటి నుండి సింగిల్‌గా ఉంటున్న ఈ అమ్మడు ఇప్పుడు ఓ కోలీవుడ్ స్టార్ తో డేటింగ్ చేస్తుందంటూ వార్తలు వినపడుతున్నాయి. ఆ హీరో ఎవరో కాదు.. విష్ణు విశాల్. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న ‘రాక్షసుడు’ సినిమా తమిళ మాతృకలో ఇతనే హీరోగా నటించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విష్ణు విశాల్, రీసెంట్గా గుత్తాజ్వాలతో క్లోజ్‌గా ఉన్న ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి. అయితే దీనిపై విష్ణు విశాల్ స్పందిస్తూ.. గుత్తాజ్వాల తనకు మంచి స్నేహితురాలేనని, ఆమెతో ఏడాదిన్నరగా మంచి పరిచయం ఉందని, ఒకరంటే ఒకరికి ఇష్టం ఉందని, ఈ పరిచయం మరో దశకు వెళుతుందా? లేదా? అని ఇప్పుడే చెప్పలేనని, ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నామంటూ సమాధానం ఇచ్చుకున్నారు. 2011లో వివాహం చేసుకున్న విష్ణు విశాల్ భార్యతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడిపోయాడు.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!