కంగనా రనౌత్, హృతిక్ మధ్య గొడవ రోజుకొక మలుపు తిరుగుతుంది. హృతిక్ `సూపర్ 30`… కంగనా రనౌత్ `మెంటల్ హై క్యా` సినిమాలు జూలై 26నే విడుదల కానున్నాయని వార్తలు వినపడుతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య పోటీ నెలకొందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. హృతిక్‌పై పోటీగా కావాలనే కంగనా తన సినిమాను విడుదల చేస్తుందంటూ హృతిక్ అభిమానులు కంగనాను టార్గెట్ చేశారు. అయితే దానికి ప్రతిగా కంగనా సోదరి రంగోలి `హృతిక్, కంగనా చేతిలో నీ పని అయిపోంది` అంటూ కామెంట్స్ పెట్టింది.
ఈ వ్యవహారంపై హృతిక్ ట్విట్టర్ ద్వారా ప్రెస్‌నోట్ ఇచ్చాడు. “నా సినిమా అంతా రెడీ అయినా కూడా ఎలాంటి పోటీ లేకుండా మంచి రిలీజ్ డేట్ చూసుకుని విడుదల చేయాలని చెప్పాను. ఓ వర్గం మీడియా సర్కస్ వల్ల మనోవేదనను అనుభవిస్తున్నాను. నన్ను పరోక్షంగా వేధిస్తూ చప్పట్లు కొడుతున్నవారిని ప్రోత్సహిస్తున్న వారిని కూడా గమనిస్తున్నాను. సమాజం నమ్మకం కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి నిస్సహాయ పరిస్థితులకు ముగింపు పలకాలి“ అన్నారు హృతిక్.
previous post
next post
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!