హీరోయిన్గా పదేళ్లపైగా అనుభవం సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించేసింది. ఇప్పుడు కుర్ర హీరోలతోనూ నటించడానికి ఓకే అంటుంది. అందుకు తగట్టు ఆమెకు అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇంతకు ముందు బెల్లంకొండ శ్రీనివాస్‌తో నటించింది. ఇప్పుడు శ్రీవిష్ణుతో నటించబోతుంది. కమల్‌హాసన్‌తో `ఇండియన్ 2`లో నటిస్తున్న కాజల్ అది పూర్తి కాగానే శ్రీవిష్ణు సినిమాలో జాయిన్ అవుతుంది. శ్రీవిష్ణు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. కొత్త దర్శకుడు ప్రదీప్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడిగా పనిచేయబోతున్నాడు. వచ్చేఏడాది నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
previous post
next post
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!